ఐఎన్ టీయూసీ నేత కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి శ్రామిక శక్తి అవార్డు ప్రదానం జరిగింది. గురువారం రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన మే డే కార్మికుల సంక్షేమం.. ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. కార్మిక వేడుకల సందర్భంగా ఐఎన్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు, డెక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి జగన్ మోహన్ రెడ్డికి శ్రమశక్తి అవార్డును ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, ఐఎన్ టీయూసీ అఖి ల భారత ప్రధాన కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. శ్రామిక శక్తి అవార్డు దక్కడం గౌరవంగా ఉందని, ఇందుకు సిఎం రేవంత్ రెడ్డికి, ఆల్ ఇండి యా ఐఎన్ టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవారెడ్డికి తన హృదయ పూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి. ఈ అవార్డు వ్యక్తి గత కృషి మాత్రమే కాదు, తిరుగులేని సమిష్టి కార్యవర్గం మద్దతు, డెక్కన్ క్రానికల్ యాజమాన్యం, సిబ్బందితో పాటు యూనియన్ సభ్యుల సహకారం తోడైందని పేర్కొంటూ వారందరికీ ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రోత్సాహం, మద్దతు, కీలక పాత్ర పోషించిన తన కుటుంబానికి తాను కృతజ్ఞుడని వెల్లడించారు.