ఆలేరు, మే 1: ( మాభూమి టైమ్స్ ప్రతినిధి): యా దాద్రి భువనగిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన వహించారు. మొదటగా ఎస్.బి.హెచ్ బ్యాంక్ దగ్గర ఉన్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి. గాంధీ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ చౌరస్తాలో ఎల్పిజి గ్యాస్ ధరలు పెంచినందుకు నిత్యావసర ధరలు పెంచినందుకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో కూరగాయలతో నిత్యావసర వస్తులతోప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తదుపరి అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ మహిళలపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని వెంటనే క్షమాపణ చెప్పాలని సునీత రావు డిమాండ్ చేశారు. తదుపరి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ ఇంద్ర కాంగ్రెస్ భవనం వరకు వెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం కమిటీ మెంబర్స్ తో ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ నిర్వహించి మహిళా కాంగ్రెస్ స్టెతన్ కోసం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో అందర్నీ గెలిపించే దిశగా పనిచేయాలని మహిళలకు పెద్ద పీట వేయాలని సునీత రావు అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కమిటీ మెంబర్లకు బూతు అధ్యక్షులకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ ఉపాధ్యక్షులు కిష్టవేని. సెక్రెటరీ దివ్య. సెక్రటరీ పావని. జిల్లా ఉపాధ్యక్షులు. జనరల్ సెక్రెటరీ సెక్రెటరీ లు. బ్లాక్ ప్రెసిడెంట్స్. మండల ప్రెసిడెంట్స్. టౌన్ ప్రెసిడెంట్స్. మున్సిపల్ ప్రెసిడెంట్స్. రమా శాఖ అధ్యక్షులు. వార్డ్ అధ్యక్షులు. బూతు కమిటీ మెంబర్స్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.