
ఆలేరు, ఏప్రిల్ 13 (మాభూమి టైమ్స్ ప్రతినిధి): ఆదివారం రోజున ఆలేరు బస్టాండ్ వద్ద సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పేద మధ్యతరగతి మీద భారాలు మోపే విధంగా పరిపాలన సాగిస్తుందని ఆదానీ అంబానీ ల ఆస్తులు వందల రేట్లు పెరుగుతున్నప్పటికీ దేశంలో పేదరికం నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నాయని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతి పాలు చేశాయని పేదలు కడుపునిండా అన్నం తినే పరిస్థితిలేక కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశం 104వ స్థానానికి పడిపోయిందని ఏ విధంగా దేశ పరిస్థితులను చూసిన దేశం అన్ని రంగాలలో అన్నారు గతంలో గ్యాస్ ధరలు పెంచినప్పటికీ పేదలకు ఉచితంగా ఇచ్చినటువంటి ఉజ్వల యోజన వినియోగదారుల పైన భారం మోపలేదని కానీ ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు సైతం 50 రూపాయలు గ్యాస్ పెంచడం కేంద్ర ప్రభుత్వం దోపిడీకి నిదర్శనం అని అన్నారు గత 12 సంవత్సరాల బిజెపి పాలనలో గతంలో ఈ దేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానులు చేసిన అప్పు కంటే మన నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల కాలంలో పదిరెట్లు అప్పు పెరిగింది అని అన్నారు లక్షల కోట్లుగా తీసుకొస్తున్న అప్పు మరియు పెరిగిన సరుకుల ద్వారా పనుల ద్వారా వస్తున్నటువంటి లక్షల కోట్లు ఉన్నాయో ఎటువైపు పోతున్నాయో తెలియక దేశ ప్రజలు దిక్కుతోచే స్థితిలో ఉండాలని అన్నారు పన్నులు పెరిగినప్పటికీ దేశంలో ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కొత్త పరిశ్రమలు స్థాపన జరగలేదని మరి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడంలోనే బిజెపి ఆర్ఎస్ఎస్ అనుకూల శక్తులకు దాసోహం అయిన కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని అన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల పరోక్షంగా ప్రభావం పడి నిత్యావాసర సరుకులు ధరలు ఆకాశాన్నంటాయని వెంటనే నియంత్రణ కోసం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరీగాడి రమేష్ బొప్పిడి యాదగిరి చెన్న రాజేష్ కాసుల నరేష్ మాదాని నవీన్ మోరీగాడి అశోక్ ఎండి మతిన్ ఎండి చెక్క పరశురాములు ఖలీల్ బర్ల సిద్ధులు ఖడ్గం సుదర్శన్ సాయిని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు