ఆధార్‌ మాదిరి ప్రత్యేక వోటర్‌ కార్డు రావాలి

0
16
A special voter card similar to Aadhaar should be introduced
A special voter card similar to Aadhaar should be introduced

ఎన్నికల సంస్కరణలపై ఇసి దృష్టి సారించాలి!

పక్కా వోటర్‌ కార్డుకు అడుగు పడాలి

వోటు అన్నది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతో విలువైనది. దీనిపై నిర్లక్ష్యం తగదు. వోటర్ల నమోదు నుంచి దొంగ వోట్ల వరకు ..ఎక్కడ లోపం ఉందో ఎన్నికల సంఘం ఆలోచించడం లేదు. ఎన్ని ప్రకటనలు గుప్పించినా నేటికీ పక్కాగా వోటు నమోదు కార్యక్రమాలు జరగడం లేదు. వోటును ఆధార్‌కు అనుసంధానం చేయాలన్న సంకల్పం నెరవేరడం లేదు. అలాగే పర్మినెంట్‌ వోటర్‌ ఐడి కార్డు నంబర్‌ ఉంటే తప్ప దొంగ వోట్లకు స్వస్తి చెప్పలేము. వోట్లను తొలగించారన్న ఆందోళనలూ తప్పుతాయి. ఈ రెండు అంశాలను ప్రజలు, మేధావులు విస్తృతంగా చర్చించాలి. ఇకపోతే తమ వోటు పదిలం అన్న భరోసా ప్రజల్లో రావడం లేదు. ఎన్నికల సంఘం ఈ మేరకు అనేక కార్యక్రమాలతో ప్రజల్లో వోటు చైతన్యానికి కృషి చేయాలి. అయితే సంస్థాగతంగా ఉన్న లోటుపాట్లపై మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించడం లేదు. వోటర్ల నమోదు మొదలుకుని దొంగ వోట్ల వరకు అనేక అనర్థాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. వోటు వేసేందుకు వెళ్లే వరకు వోటు ఉంటుందో లేదో తెలియడం లేదు. ఆధార్‌ నమోదు చేసుకున్నట్లుగానే పర్మినెంట్‌ నంబర్‌ ఉండాలి. పాన్‌ కార్డు నమోదయితే పర్మినెంట్‌ నంబర్‌ ఉంటుంది. వోటుకు పర్మినెంట్‌ నంబర్‌ రావాల్సి ఉన్నా ఎందుకనో ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదు. వోటుకు ఆధార్‌ అనుసంధానం చేయడం ద్వారా వోటును కూడా పర్మినెంట్‌ చేయాలి. ఇదే సందర్భంలో వోటుకు కూడా ఆధార్‌ లాగా పర్మినెంట్‌ నంబర్‌ కూడా కేటాయిస్తే మరీ మంచిది. అప్పుడు బోగస్‌ అన్నదానికి చెక్‌ పెట్టగలం. ఎన్నికల సంస్కరణలను ఆషామాషీగా కాకుండా పక్కాగా అమలు చేస్తేనే మంచిది. వోటుకు కూడా ఆధార్‌ లాగా పర్మినెంట్‌ నంబర్‌ ఉంటే ఇలాంటి తొలగింపు అవకాశాలు ఉండవు. ఎలాంటి లోటుపాట్లు లేని వోటరు నమోదుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఎన్నికల సంఘం గుర్తించడం లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఎన్నికల సంఘం ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. విపరీతమైన అధికారాలు కలిగి ఉన్నా సమర్థత ప్రదర్శించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణప్రదమైనవి. వోటర్ల జాబితాలు ఎంత స్వచ్ఛంగా, దోషరహితంగా ఉంటే ఎన్నికలు అంత సవ్యంగా జరుగుతాయి. కానీ ఇప్పుడదే వివాదంగా మారింది. వోటర్ల నమోదు, తొలగింపు ఓ ప్రహసనంగా మారింది. పక్కా కార్యాచరణ జరగడం లేదు. శేషన్‌ లాగా బూజు దులిపి హంటర్‌ చేతబట్టిన వారు తరవాతి కాలంలొ రాలేదు. వోటర్ల నమోదు, తొలగింపు, నిర్వహణ అంతా వివాదాల్లో నడుస్తోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్ప క్షపాతంగా నిర్వహించడం ఈ సంస్థ నైతిక బాధ్యత. వోటర్ల జాబితాలలో అనేక అవక తవకలు బయటపడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పైనా, రాష్ట్రప్రభుత్వ సిబ్బంది పైనా ఆధారపడి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర అధికారులు సహజంగానే అధికారపార్టీకి విధేయంగా ఉంటారు. అటువంటప్పుడు అధికారపార్టీ బుద్ధిపూర్వకంగా రకరకాల ఎన్నికల అక్రమాలకు ఒడిగట్టితే వాటిని ఎన్నికల కమిషన్‌ ఏ విధంగా నివారించగలదనే సందేహం కలుగుతోంది. ఏటా జాతీయ వోటరు దినోత్సవం జరుపుకుంటున్న వేళ వోటర్ల సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్నయాలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలను గమనించి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. వోటర్ల తొలగింపు ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. దీనిని ఏ విధంగా చక్కదిద్దుతారో తెలియడం లేదు. వోటరు ఐడి కార్డు పట్టుకుని వెళితే జాబితాలో పేర్లు ఉండడం లేదు. దీనికి పక్కా విధానం అమలు కావాల్సి ఉంది. దొంగ వోట్ల విషయంలో కూడా ఇసి సరైన చర్యలు తీసుకోవడం లేదు. వోట్ల నమోదులో కొన్ని రాజకీయ పక్షాలు అదే పనివిూద ఉంటాయి. అధికార పార్టీ నేతలు బోగస్‌ వోట్లను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్ర మాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు అన్నచోట్లా వున్నాయి. సర్వేల పేరిట జరుగుతున్న తతంగం కూడా అధికార పార్టీ నేతల పర్యవేక్షణలోనే సాగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెవెన్యూ అధికారులు ఎటువంటి విచారణ లేకుండానే బోగస్‌ వోటర్లను నమోదు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దొంగ వోట్లు ఫలానా ప్రాంతంలో ఉన్నాయనీ, దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలనీ ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశిస్తే చక్కదిద్దు తారన్న భరోసా లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇసి సక్రమంగా ముందుకు వెళ్లగలదు. అధికారుల పరిశీలనలో దొంగ వోట్లు నమోదైనట్టు రుజువైతే తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్‌ వేయడానికి గడువు ముగిసే క్షణం వరకూ కొత్త వోట్లను చేర్చుకునే పక్రియ కొనసాగుతోంది. ఇకపోతే రాజకీయ పార్టీల ప్రమేయంతో వోట్ల తొలగింపు జరుగుతోందన్న వాదన ఉంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దొంగ వోట్లను తొలగించాలనే పట్టుదల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిజంగా ఉంటే అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అంకిత భావంతో పనిచేసే సిబ్బందిని తగినంతగా సమకూర్చాలని రాష్ట్రపతిని అభ్యర్థించాలి. నామినేషన్ల గడువు ముగియడానికి ముందు ఉన్న వోట్లకు పదిహేను లేదా ఇరవై శాతం కొత్త వోట్లు నమోదు చేస్తున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత దొంగ వోట్లను గుర్తించి, తొలగించడానికి తగిన సమయం ఉండటం లేదు. అక్రమాలు జరిగినట్టు తెలుసుకొని ఎన్నికల పక్రియ ముగిసిన తర్వాత అధికారులపైన ఎటువంటి చర్య తీసుకున్నా లాభం ఉండదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లకు మంచి పేరు ఉన్నప్పటికీ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం యథావిధిగా జరుగుతోంది. గతానుభవాను దృష్టిలో పెట్టుకుని పక్కాగా వోటరు నమోదు కార్యక్రమం ఉండాలి. అవసరమైతే సాంకేతి కతను మరింతగా ఉపయోగించు కోవాలి. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిన అధికారులు ఎంతవారైనా వారిపైన చర్యలు తప్పవన్న హెచ్చరికలు కఠినంగా అమలు కావాలి. అప్పుడే భయం ఏర్పడుతుంది. అందుకు ఎన్నికల సంఘం ముందుకు వస్తుందా అన్నది చూడాలి. ఆధార్‌తో వోటర్‌ ఐడీ అనుసంధానం ద్వారా దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆధార్‌ కార్డు లాగానే వోటరు ఐడికి కూడా పర్మినెంట్‌ నంబర్‌ ఉంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వోటును కోల్పోవడం లేదా..బోగస్‌ను నివారించవచ్చని అంటున్నారు. ఆధార కార్డు మాదరిగా వోటర్‌ ఐడికి నంబర్‌ ఉంటే మంచిదని అంటున్నారు. ప్రతి ఒక్కరూ వోటు వేసేలా.. వోటు పరమపవిత్రంగా ఉండేలా…ఒకరి వోటు మరొకరు వేయకుండా..వోటును అకారణంగా తొలగించకుండా కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. వోటరు దినోత్సవం జరుపుకుంటున్న వేళ కఠిన సంస్కరణలతో ఎన్నికల సంఘం ముందుకు సాగాల్సి ఉంది. ఏటా వోటరు దినోత్సవం జరుపుకుంటున్నా.. వోటు విషయంలో పక్కా ప్రణాళికలు అమలు కావడం లేదు. ఆధార్‌, పాన్‌కార్డు పక్కాగా ఉంటున్నా…వోటరు కార్డును నేటికీ పక్కాగా రూపొందించుకోవడం లేదు. తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆధార్‌తో వోటును అనుసంధానం చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here