Thandel Movie Review in Telugu : దేశభక్తిని రగిలించే కథ!

0
26
Thandel Movie Review in Telugu :
Thandel Movie Review in Telugu :

తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘తండేల్’. ప్రేమ కథగా, దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్ర జాలరు కథగా తెరకెక్కిన ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ ఇంకా పెంచింది. ఇక భారీ అంచనాలతో ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 07, 2025) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో.. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో.. చాన్నాళ్ల తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ నుండి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…

కథ: శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్య కార గ్రామం. ఆ వూళ్ళో పక్కపక్క ఇళ్లలోనే ఉండే జాలరి కుటుంబాలకు చెందిన రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమలో వుంటారు. గుజరాత్ తీరానికి వెళ్లి వేటాడే బృందానికి తండేల్(లీడర్)గా వ్యవహరిస్తూ ఉంటాడు రాజు. ఊరిలో కొన్ని సంఘటనలు చూసి రాజుని ఇక వేటకు వెళ్ళకూడదు అని కోరుతుంది సత్య. ఆమె మాట వినకుండా వెళ్ళాడని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అతని రాకకు ఎదురుచూస్తుండగా పాక్ నేవీకి చిక్కి జైలు పాలైన సంగతి తెలుస్తుంది. అయితే తన ఊరి వారందరూ పడుతున్న ఇబ్బందిని గమనించి ఎలా అయినా సరే.. రాజు సహా ఇతర జాలర్లను భారత్ తీసుకు వచ్చేందుకు ఢిల్లీ వెళ్లి పోరాటం మొదలు పెడుతుంది. రాజు తన తండ్రి నుండి పుణికిపుచ్చుకున్న చేపల వేట మరియు నాయకత్వ లక్షణాలతో శ్రీకాకుళం నుండి చేపలు పట్టడానికి గుజరాత్ వెళ్లే గుంపుకు తండేల్ గా వ్యవహరిస్తాడు. 9 నెలలు సముద్రంలో చేపలు పడుతూ గడిపేసి.. మూడు నెలలు మాత్రం తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సత్యతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఒకసారి చేపల వేటకు వెళ్లినప్పుడు.. అనుకోని విధంగా పాకిస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించి, అక్కడి ఆర్మీ చేత అరెస్ట్ చేయబడతారు 22 మంది మత్స్యకారులు. పాకిస్థాన్ జైల్ నుంచి ఆ 22 మంది మత్స్యకారులను ఇండియాకి తీసుకొచ్చేందుకు సత్య ఎలా పోరాడింది? ఈ క్రమంలో భారతీయ ప్రభుత్వం ఎలా సహాయ పడింది? ఇలాంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్ లో చిక్కుకున్న జాలర్లు తిరిగి వచ్చారా? రాజు సత్య ఏకమయ్యారా? లేక సత్య వేరే వివాహం చేసుకున్నదా ? పరాయి దేశంలో జైలుపాలైన రాజు, అతని టీమ్ రాక కోసం సత్య ఏం చేసింది ?, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది?, అసలు మనసులో రాజును పెట్టుకుని, సత్య ఎందుకు మరో పెళ్లికి సిద్ధమైంది? చివరకు సత్య – రాజు ఒక్కటి అయ్యారా ? లేదా ? రాజు, సత్య మధ్య ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? సత్యకు ఇచ్చిన మాటను రాజు ఎందుకు తప్పాడు? సత్యకు ఏం మాట ఇచ్చాడు? ఎందుకు మాటను తప్పాల్సి వచ్చింది? మాట తప్పిన రాజుకు శిక్ష విధించేందుకు సత్య ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? పాకిస్థాన్‌ పోలీసులకు పట్టుబడిన రాజు బృందానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తండేల్ అంటే లీడర్‌గా తనతో పాటు వచ్చిన 22 మంది జాలర్ల కోసం ఎలాంటి తెగింపుకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ జైలు నుంచి విడుదలకు అనుమతి లభించినా రాజు బృందం ఎందుకు బయటకు రాలేకపోయింది? వేరే వ్యక్తితో సత్య పెళ్లికి సిద్దపడిన విషయం తెలిసిన రాజు రియాక్షన్ ఏమిటి? చివరకు పాక్ జైలు నుంచి ఎలాంటి కండీషన్ల మధ్య రాజు బృందం విడుదలైంది? సత్య, రాజు ప్రేమ కథకు ముగింపు ఏమిటనేది వెండితెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ: ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల చూట్టు తిరిగే కథే ‘తండేల్’. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలుపాలైన ప్రియుడి రాక కోసం ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందనేది తండేల్ సినిమా. యధార్థ సంఘటనలకు కొంత కాల్పనికత జోడించి తండేల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఘాడంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది మిగిలిన కథ. కొన్ని కథలు పాయింట్ గా అనుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ పాయింట్ ను సరైన కథనంతో ప్రెజెంట్ చేసినప్పుడే సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ కీలకమైన కథనం విషయంలోనే “తండేల్” కొంత తడబడింది. ఆ కారణంగా నేచురల్ సెట్స్, మంచి ప్రొడక్షన్ డిజైన్, అద్భుతమైన నట ప్రదర్శన ఉన్నప్పటికీ.. సినిమా పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. అయితే.. నటుడిగా నాగచైతన్య పడిన కష్టాన్ని, చందు మొండేటి కొన్ని సీన్స్ ను కంపోజ్ చేసిన విధానాన్ని, టెక్నికల్ టీమ్ పడిన శ్రమను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన.. ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరోహీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందూ మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతుకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది.
2018-19 కాలంలో జరిగిన రియల్ స్టోరీని సినిమాగా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో నేవీకి చిక్కి జైలుకు వెళ్లారు. 16 నెలల జైలు శిక్ష అనంతరం వారి కుటుంబాల పోరాటం కారణంగా తిరిగి భారత్ లో అడుగు పెట్టారు. ఇది లైన్. దానికి ఒక అందమైన ప్రేమ కథను అటాచ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. రాజు- సత్య చిన్ననాటి నుంచి పక్కపక్క ఇళ్లలో పెరుగుతూ ఉండడంతో ఒకరంటే ఒకరికి విడిచి ఉండలేనంత ప్రేమ ఏర్పడుతుంది. ఈ క్రమంలో తన మాట వినకుండా వేటకు వెళ్లాడని రాజుని కాదని వేరే వివాహానికి కూడా సిద్ధమవుతుంది | సత్య. అయినా సరే పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న రాజుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది? చివరికి ఎలా కాపాడుకుంది అనేది ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. బీజానికి నిజ జీవితంలో రెండు మూడు జంటల మధ్య ఉన్న సంఘటనలను ఒకే జంటకు కలిపి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజ జీవిత ఘటనలను సినిమాటిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో చందు చూపించిన చొరవ అభినందనీయం. నిజానికి టీం చెప్పినట్టు అద్భుతమైన లవ్ స్టోరీ అని అనలైం కానీ ప్రేమికులందరూ కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్న తీరు బాగుంది. సినిమా ఓపెనింగ్ లోనే తనకు ఇక రాజు వద్దు, వివాహానికి సిద్ధమవుతాను అంటూ తన తండ్రికి సత్య క్యారెక్టర్ చెప్పే సీన్ తో ప్రారంభమై తర్వాత ఫస్ట్ ఆఫ్ అంతా వారి ప్రేమ ఎపిసోడ్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడం, అక్కడ జైలు జీవితం, జైలులో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇలాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో టీం సక్సెస్ అయింది. అక్కడి జైలు నుంచి వచ్చేందుకు ఎన్ని నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి? ఆ వచ్చిన తర్వాత రాజు సత్యను కలిశాడా లేదా అనే విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే అందుకోసం విపరీతమైన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించింది. ఒకపక్క ఎమోషనల్ స్టోరీగా చూపిస్తూనే మరోపక్క సినిమాను మంచి దేశభక్తితో కూడిన అంశాలతో నింపడం అభినందనీయం. అయితే ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలు ఉండడంతో దీనిని మరింత పబ్లిసిటీ నార్త్ లో చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తమ్మీద చందూ మొండేటి రాసిన కథనం మరియు పాత్రలు ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను చాలా బాగా మలిచాడు దర్శకుడు చందూ మొండేటి. కథలోని ప్రధాన పాత్రలను, కథా నేపథ్యాన్ని అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్సే కదా అని ఫీల్ ని కలిగిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నేరేషన్ వంటి అంశాలు సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి. తండేల్ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా, బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ బాగా ఆకట్టుకుంది. పైగా, గుడ్ కంటెంట్ తో పాటు డీసెంట్ టేకింగ్, మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఐతే, స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. కానీ, చైతు, సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. చందూ రచన – దర్శకత్వం కూడా మెప్పించాయి. ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో నాగ చైతన్య , సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ను ముగించిన దర్శకుడు, సెంకడాఫ్‌లో మెయిన్ పాయింట్‌లోకి వెళ్తాడు. అయితే ఈ సమయంలో దర్శకుడు కాస్తా తడబడినట్టు అనిపించింది. అయితే తిరిగి పుంజుకుని చివరి 20 నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు.
ఉత్తరాంధ్రలో జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని దర్శకుడు చందూ మొండేటి ఎంచుకొన్న పాయింట్ బాగుంది. స్టోరీ పాయింట్ చుట్టు రాసుకొన్న లవ్ ట్రాక్ సినిమాకు ప్రాణంలా నిలిచేలా చేశాడు. కానీ కథ చెప్పడంలోను సాగదీసి సాగదీసి విసిగించేలా కొన్ని సీన్లు పెట్టుకోవడం పంటి కింద రాయిలా అనిపిస్తుంది. ఇక సాయిపల్లవి, నాగచైతన్యను బాగా నమ్ముకొని.. మిగితా క్యారెక్టర్లకు బీ గ్రేడ్ యాక్టర్లను ఎంచుకోవడం వల్ల సినిమాకు రావాల్సిన ఫీల్, స్టేటస్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సాయిపల్లవికి పెళ్లి చేసుకోవాలనుకొన్న వ్యక్తిని నాసిరకమైన యాక్టర్ పెట్టడం వల్ల మూవీకి కనెక్టివిటీ మిస్ అయిందనిపిస్తుంది. కాకపోతే సాయి పల్లవి, చైతూ కోసం రాసుకొన్న సన్నివేశాలు ఫస్టాఫ్‌కు ప్లస్ పాయింట్‌గా మారాయి. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ ఎపిసోడ్ విషయంలో స్క్రిప్టుపరంగా చాలా లోపాలు కనిపించాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కథలో ఉండే ఇంటెన్సిటీ, జెన్యూనిటీ తేలిపోయింది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ఎమోషన్స్‌ను బ్రేక్ చేశాయనిపిస్తుంది. ఇలాంటి లోపాలన్నింటిని సాయిపల్లవి తన ఫెర్ఫార్మెన్స్‌, ప్రజెన్స్‌తో సరిదిద్దిందనే చెప్పవచ్చు. ఇక కీలక సన్నివేశాల్లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే కొన్నీ ఎపిసోడ్స్‌లో నాగచైతన్య యాక్టింగ్ హైలెట్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్లు సాగదీసినట్టు, మరికొన్ని సీన్లు ఎమోషనల్ ఉండటంతో మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ఎట్టకేలకు సినిమా ముగిసిందనే ఫీలింగ్ కలుగడం సహజంగానే అనిపిస్తుంది.

నటీనటుల పనితీరు: హీరోగా నాగచైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతు తన పాత్రలోకి ఒదిగిపోయాడు. నాగచైతన్య పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించాడు. భాష, యాస, బాడీ లాంగ్వేజ్ వంటి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తపడ్డాడు. చాలా సాధారణ సన్నివేశాల్లో కూడా మంచి ఎమోషన్ పండించాడు చైతన్య. నటుడిగా అతడ్ని మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఈ సినిమాలో నాగచైతన్య నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ముఖ్యంగా లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అదరగొట్టాడు. అలాగే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా ఈజ్ తో కనిపించడం గమనార్హం. నిజానికి సాయి పల్లవి పక్కన నటించడానికి హీరోలు ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో ఆమెను డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ లో చైతన్య నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగ చైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్‌గానే చూసిన అభిమానులకు, తనలోని మరో యాంగిల్‌ను ఆయన పరిచియం చేశారు. చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్‌కు లీడర్‌గా, పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య మెప్పించారు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు. కొన్ని సీన్లలో నాగ చైతన్య యాక్టింగ్‌కు కంటతడి రావడం పక్కా. త‌న కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజు పాత్రను ఓన్ చేసుకొని నటించిన విధానం బాగుంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్ ట్రాక్‌లో చైతూ, సాయిపల్లవి జోడి ఇరగదీసిందనే చెప్పొచ్చు. తండేల్ సినిమా నాగచైతన్యకు కమ్ బ్యాక్ మూవీ. ఆ సినిమా కోసం పెట్టిన హార్డ్ వర్క్, చూపించిన యాక్టింగ్‌ నిజంగా ప్రశంసనీయం.
ఇక బుజ్జితల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఎ ప్పటిలానే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో సాయిపల్లవి రాకింగ్. పాకిస్థాన్‌లో దొరికిపోయిన తన ప్రియుడు కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించారు సాయి పల్లవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సరైన మెచ్యూరిటీ లేని ఒక సగటు ఆడపిల్లగా ఆమె ఆకట్టుకుంది. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. తండేల్ సినిమాను ఆద్యంతం సాయిపల్లవి మెట్టు ఎక్కించే ప్రయత్నం చేసింది. కథాపరంగా ఉన్న కొన్ని లోపాలను కూడా తన పెర్ఫార్మెన్స్‌తో కనిపించకుండా చేసేలా నటించింది. సత్య పాత్రలో జీవించింది. చాలా సన్నివేశాల్లో ఉద్వేగభరితమైన నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా చేస్తుంది.
మరో కీలక పాత్రలో నటించిన దివ్య పిళ్ళై తన నటనతో ఆకట్టుకోగా.. ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన ఆడు కాలం నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్, బబ్లూ పృథ్వీరాజ్, కల్పలత వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల శ్రీకాకుళం యాస విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

సాంకేతికవర్గం పనితీరు: దేవిశ్రీప్రసాద్ పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. “హైలెస్సా, బుజ్జి తల్లి” పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో, తెరపై అంతే అందంగా ఉన్నాయి. పాటల చిత్రీకరణ విషయంలో మాంటేజస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల.. మంచి ఫీల్ ఇచ్చాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. శామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. సముద్రంలో తుఫాన్ ఎపిసోడ్ ను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన విధానం బాగుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడకపోవడం వల్ల క్వాలిటీ పరంగా సినిమా మెప్పించింది. మరీ ముఖ్యంగా నాగేంద్ర కుమార్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఇళ్లు కానీ పడవలు కానీ, జైల్ అన్నీ చాలా నేచురల్ గా ఉన్నాయి. దర్శకుడు చందు మొండేటి సినిమాలో రెండు పడవల ప్రయాణం చేశాడు. ప్రేమకథలో, దేశభక్తిని జొప్పించే ప్రయత్నంలో ఎమోషన్ లోపించింది. ముఖ్యంగా పాకిస్థాన్ జైల్ ఎపిసోడ్ చాలా పేలవంగా సాగింది. అలాగే.. లీడ్ పెయిర్ లవ్ స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. అయితే.. నాగచైతన్యలోని నటుడ్ని వినియోగించుకోవడంలో, తండేల్ ప్రపంచాన్ని నిర్మించడంలో విజయం సాధించాడు. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమాలో షామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రేమ కథకు అనుగుణంగా విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా సాయి పల్లవి పై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ల్యాగ్ సీన్స్ లెంగ్త్ ను తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాలో నిర్మాత బన్నీ వాసు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందూ మొండేటి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి. కొన్ని ఫ్రేమ్స్ తో పాటు చిన్న చిన్న మైన్యూట్ డీటైలింగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగాల పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణాన్ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీ గా ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చూసుకున్నారు. సాయిపల్లవి నటిగా విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో శ్రీకాకుళం యాసలో సహజత్వం లోపించింది. అందువల్ల డైలాగ్స్ లో ఫీల్ మిస్ అయ్యింది. అయితే.. మొండి ప్రేమికురాలిగా ఆమె హావభావాలు ప్రేక్షకులని అలరించాయి. తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలిచారు.ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట వినిపిస్తుంది.చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కార్తికేయ-2 తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు, సెంకడాఫ్‌‌కు వచ్చే సరికి కథను సరిగా ముందుకు తీసుకువెళ్లడంలో కాస్తా తడపడ్డారు. అయినప్పటికీ చివరి 20 నిమిషాల సినిమాను అద్భుతంగా మళ్లించడంలో అతను సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువులు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. చాలా చోట్ల పేలవమైన సన్నివేశాలకు దేవీ శ్రీ ప్రసాద్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. పాటలు సినిమాకు నెక్ట్స్ లెవెల్ అనే విధంగా ఉన్నాయి. పోర్టు సీన్లు, సముద్ర మీద సన్నివేశాలు, పాకిస్థాన్, వాఘా బోర్డర్ సీన్లను సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ బాగా చిత్రీకరించాడు. నాగేంద్ర ఆర్ట్ వర్క్ బాగుంది. బన్నీ వాసు అనుసరించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి. జాలర్ల కుటుంబాల్లో ఉండే వెతలు, సాధకబాధకాల బ్యాక్ డ్రాప్‌తో ఎమోషనల్ లవ్ స్టోరి, దేశభక్తి అంశాలను కలిపి రూపొందించిన చిత్రం తండేల్. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయని చెప్పాలి. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ కాగా.. నాగచైతన్య యాక్టింగ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. టెక్నికల్ అంశాలు సినిమాలో డామినేట్ చేసే అంశాలుగా కనిపిస్తాయి. కథ, కథనాల పరంగా చందూ మొండేటి ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది. లాజిక్స్, స్క్రిప్టుపరంగా లోపాలను వెతక్కుండా సినిమా చూస్తే.. సినిమా తెగ నచ్చేస్తుంది. లవ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమా పక్కాగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ సినిమా.

(చిత్రం : ‘తండేల్’, విడుదల ఫిబ్రవరి 07, 2025, నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్లై, ఆడుకాళం నరేన్, కరుణాకరన్, బబ్లూ పృథ్విరాజ్, కల్పలత తదితరులు. దర్శకత్వం: చందూ మొండేటి, నిర్మాత: బన్నీ వాసు సమర్పణ: అల్లు అరవింద్, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్, ఎడిటర్: నవీన్ నూలీ, సాహిత్యం: శ్రీ మణి, ఆర్ట్: నాగేంద్ర, బ్యానర్: గీతా ఆర్ట్స్ )