మూసీ సుందరీకరణతో పేదల ఇళ్ల కూల్చివేత

0
35
Demolition of poor houses with beautification of Musi
Demolition of poor houses with beautification of Musi

ఇళ్ల కూల్చివేతను తప్పకుండా వ్యతిరేకిస్తాం
మల్లన్న సాగర్‌ను మించి మూసీకి పరిహారం ఇవ్వాలి
రేవంత్‌ పాదయాత్ర చేస్తే మేమూ వస్తాం
కుర్చీకాపాడుకునేందుకే రేవంత్‌ రెడ్డి తంటాలు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లు ఖాయం
కేసులతో బెదిరింపులకు దిగితే భయపడేది లేదు

మాజీమంత్రిహరీష్‌ రావు విమర్శలు

By/ Mohammed Shafi
cell : 6301450554)

మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని.. అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకమని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మూసీ పేరిట కవిూషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. మల్లన్న సాగర్‌ నిర్వాసిత కాలనీ రాజమౌళి సినిమాను తలపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్‌ బాధితులకు ఒక్క ఇల్లూ కట్టలేదని తప్పుగా మాట్లాడారని.. మల్లన్నసాగర్‌కు 50వేల ఎకరాలు కాదు.. 17వేల ఎకరాలేనన్నారు. 14వేల ఎకరాలు ప్రభుత్వ పట్టా అసైన్డ్‌ భూమి.. 3వేల ఎకరాలు ఫారెస్ట్‌ భూమి అని చెప్పారు. ఏడు గ్రామాలు ముంపునకు గురైతే 14 గ్రామాలు అయ్యాయని తెలిపారు. సీఎం ఇలా మాట్లాడుతూపోతే ఇక ఆయన మాటలను ఎవరూ నమ్మరన్నారు. మూసీ బాధితులకు మల్లన్న సాగర్‌కు మించిన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూసీ బాధితులకు గచ్చిబౌలి భూముల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్‌ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం. సీఎం రేవంత్‌ రెడ్డి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు రావాలని షరతు విధించారు. మమ్మల్ని డీల్‌ చేయడం కాదు.. రేవంత్‌ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలి. పక్కనున్న వాళ్లే ఆయన్ను దించేయకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా.. 6 మంత్రి పదవులు నింపుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారాసకు 100 సీట్లు రావడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం విూడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. రేవంత్‌ సీఎం అయ్యేవాడు కాదన్నారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్‌ చేసుకోవాలని.. తన కుర్చీని ఎప్పుడు గుంజుకుపోతారోనన్న భయంలో రేవంత్‌ ఉన్నాడన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని.. సీఎం అయ్యేది కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ మూడుసార్లు ఓడిరదని.. మరి కాంగ్రెస్‌ ఖతం అయిపోయిందా? అంటూ ప్రశ్నించారు. 31 సాకులు చూపుతూ రుణమాఫీ చేయకుండా రేవంత్‌ రైతులను మోసం చేశారని విమర్శించారు. మంత్రి పదవులు నింపేందుకే రేవంత్‌కు హైకమాండ్‌ అనుమతి ఇవ్వట్లేదని.. విద్య, మైనారిటీ, పోలీసుశాఖలకు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌విప్‌ లేరన్నారు. కేసీఆర్‌ పవర్‌ఫుల్‌ ఫైటర్‌, లీడర్‌ అని చెప్పారు. రేవంత్‌రెడ్డి చిల్లరమాటలు ఆపితే మించిదని సూచించారు. ఓ మంత్రి గవర్నర్‌ని కలిశారని.. ఇంకో మంత్రి కాబోయే సీఎంనని సోషల్‌ విూడియాలో పెట్టుకుంటున్నారని అన్నారు. సీఎం చిట్‌చాట్‌లో మాట్లాడి కుర్చీకి ఉన్న గౌరవం తగ్గించారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్‌ కూడా సిగ్గుపడుతారన్నారు. రేవంత్‌ మాట్లాడితే ఎక్కడ ఆ దుర్భాష విని పిల్లలు చెడిపోతారోనని.. ఇండ్లల్లో తల్లిద్రండులు టీవీలను బంద్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మూడువైపులా సముద్రం ఉందంటారని.. అలా అయితే గోవా వెళ్లడం ఎందుకని జోకులు వేస్తున్నారన్నారు. రాజీవ్‌ కంప్యూటర్‌ కనిపెట్టాడని అంటాడని.. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతారని.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండీ ఇలా మాట్లాడుతూ పోతే.. గ్రూప్‌`1 పరీక్ష రాసేవాళ్లు ఏమైపోవాలని అన్నారు. తాను కొడంగల్‌లో ఒడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. సన్యాసం తీసుకోకుండా ఎంపీకి ఎందుకు పోటీశారని నిలదీశారు. శుద్ధమైన నదీ జలాలకు బీఆర్‌ఎస్‌ అనుకూలమని.. పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకమని క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం మంచినీళ్లు మూసీకి తీసుకురావాలన్నది కేసీఆర్‌ విజన్‌ అని తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి మూసీకి నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్‌ డీపీఆర్‌ చేశారన్నారు. కొండపోచమ్మ సాగర్‌ కాకుండా మల్లన్నసాగర్‌ నుంచి ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. రూ.1100కోట్లతో అయ్యే పనిని రూ.7వేలకోట్ల కమిషన్‌ కోసం పెంచారని మండిపడ్డారు. గచ్చిబౌలిలో 450 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని.. మూసీ బాధితులకు ఆ స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.75కోట్లకు ఎకరా భూమి అమ్మింది రేవంత్‌ ప్రభుత్వమేనన్నారు. 2013 యాక్ట్‌ కంటే బాగా ఇవ్వమని తాము అడుగుతున్నామన్నారు. రేవంత్‌ పాలనలో ఇండ్లు కూల్చారు తప్పా.. ఒక్కటైనా కట్టారా? అని హరీశ్‌రావు నిలదీశారు. ఏక్‌ పోలీసింగ్‌ కోసం పోలీసుల పోరు జరుపుతున్నారని.. రేవంత్‌ చెప్పిందే వారు అడుగుతున్నారన్నారు.అంబేద్కర్‌ విగ్రహానికి సీఎం దండ వేయరని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయరంటూ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ తప్పుడు విధానాలతో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని చెప్పారు. ఇతర రాష్టాల్లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగిపోతున్నా.. తెలంగాణలో మాత్రం ఎందుకు తగ్గుతోందని నిలదీశారు. హైడ్రా ఎఫెక్ట్‌తో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఢమాల్‌ ఢమాల్‌ అయ్యిందన్నారు. రేవంత్‌ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తప్పుడు కేసులు పెట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో తనను.. కేటీఆర్‌ను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమపైనే కాకుండా ప్రశ్నించే గొంతులపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ పెట్టడం తుగ్లక్‌ చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, దురాలోచనతోనే ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.35వేలకోట్ల ఖర్చు అని అంటున్నారని.. కేంద్రం ఫ్రీగా చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం ఎందుకని నిలదీశారు. అలైన్‌మెంట్‌ మార్చాల్సిన అవసరం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ ప్రభుత్వం 11 నెలల్లోనే రూ.85వేలకోట్ల అప్పులు చేసిందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పు రూ.4,26,499కోట్లు మాత్రమేనన్నారు. పదినెలల కాంగ్రెస్‌ పాలనలోనే రూ.85వేలకోట్ల అప్పులు తీసుకున్నట్లుగా క్లియర్‌గా ఉందని.. బడ్జెటేతర రుణాల వివరాలను తమకు చెప్పలేదని కాగ్‌ తన నివేదికలో చెప్పిందని గుర్తు చేశారు. అప్పుల వివరాలు ఎందుకు చెప్పడం లేదని.. ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. తీసుకున్న రుణాలను ఏం చేస్తున్నారని నిలదీశారు. రేవంత్‌కు ఫుట్‌బాల్‌ ఒక్కటే వచ్చని.. తనకు క్రికెట్‌ కూడా తెలుసునన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్‌ కొట్టేది.. వికెట్‌ తీసేది తామేనన్నారు. రేవంత్‌ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని.. ప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై పగబడుతున్నారన్నారు. ఫార్ములా రేసింగ్‌పై ఏసీబీ విచారణ చేయనివ్వాలని.. ఇంకా ఏయే కేసులు పెడతారో చూస్తామన్నారు.