సిపిఎం దిగ్గజనేత సీతారాం ఏచూరీ కన్నుమూత…లెఫ్ట్ ఉద్యమంలో చెరగని ముద్ర!
సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్ బ్యూరో… పలువురు ప్రముఖుల సంతాపం…
మాటల్లో మెతకదనం..భావంలో తీవ్రత..మృదు స్వభావం ఆయన సొంతం. మెతకగా ఉన్నట్లు కనిపించినా…దేశం కోసం పాటుపడే ఆయన అతురత చురకత్తిలా ఉండేది. సమస్య ఎక్కడ ఉన్నా పరుగెత్తే ప్రవాహం ఆయన నైజం. చిన్న వయసులోనే రాజకీయాల్లో ఆరితేరారు. వామపక్షభావజాలం అనుణువణువూ నింపుకున్న ఏచూరి..నిరంతరం భారత ఆర్థిక అభివృద్ది కోసం తపించేవారు. ఆయనే సీతారం ఏచూరి. ఇంతటి మహోన్నతుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్నారు. అత్యతం పిన్నవయసులోనే దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన తెలుగు బిడ్డ. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢల్లీి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఓ ధృవతార నింగికేగింది. ఆయన మృతికి ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, సిపిఎం పోలిట్ బ్యూరో సమా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏచూరి.. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 32 ఏళ్లుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగు తున్న ఏచూరి 2015లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2005 ` 2017 వరకు బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఆయన పూర్తిపేరు ఏచూరి సీతారామరావు. 1952 ఆగస్టు 12 చెన్నైలో వైదేహి బ్రాహ్మణులైన సర్వేశ్వర సోమయాజులు ఏచూరి,కల్పకం దంపతులకు జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆంధప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారిగా ఉండేవారు. ఏచూరి బాల్యం ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగింది. భాగ్యనగరంలోని అల్ సెయింట్స్ హైస్కూల్లో ఆయన మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢల్లీికి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సీబీఎస్సీ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అనంతరం అక్కడే పీహెచ్డీ కోర్సులో చేరారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా ఎమ్జ్గంªన్సీ విధించడం.. ఏచూరీని అరెస్ట్ చేయడంతో పీహెచ్‌డీని కొనసాగించలేకపోయారు. సీతారం ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా.. జర్నలిస్టు సీమా చిత్తీ రెండో భార్య. ఏచూరి రెండో భార్య సీమా చిస్తీ జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఒకసారి చెప్పారు. మొదటి భార్యకి ఒక కుమార్తె, కుమారుడు సంతానం ఉండేది. అయితే కుమారుడు ఆశిష్.. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో మరణించారు. తప్పు జరిగితే సహించలేని మనస్థత్వం ఏచూరిది. అందుకే చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్మూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సీపీఎంలో చేరారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ బాధితుల్లో ఏచూరీ కూడా ఒకరు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సమాఖ్యకు ఏచూరి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్షాలకు కంచుకోటగా మార్చారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు.1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1990లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 2005లో వెస్ట్ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ విప్లవ సూర్యుడు వీఎస్ అచ్యుతానందన్‌కి ఏచూరి అత్యంత సన్నిహితుడు. ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ.. ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ’కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’ ముసాయిదాను రూపొందించడం లో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంతోపాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు.
ఏచూరి మృతిపై ప్రముఖుల సంతాపం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భార్రతి వ్యక్తం చేసారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ’ఎక్స్’లో పోస్టులు పెట్టారు. ఏచూరి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజకీయాల్లో ఆయన గౌరవస్థానం పొందారన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి అని కొనియాడారు. అట్టడుగు వర్గాల ప్రజలతో మంచి అనుబంధం ఉన్న నేత అన్నారు. విశాల దృక్పథంతో కూడిన రాజకీయ చర్చలు పార్టీకి అతీతంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. సీతారాం ఏచూరి మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఆయన తనకు మంచి మిత్రుడు, ఆప్తుడన్నారు. ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత ’ఐడియా ఆఫ్ ఇండియా’కు రక్షకుడిగా పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఏచూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి మరణం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రముఖ పార్లమెంటేరియన్ అని.. అలాంటి గొప్ప నేత మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఏచూరి మరణం దిగ్భార్రతిని కలిగించింది. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి నిష్ణాతుడైన రాజకీయవేత్త, ఆలోచనాపరుడు. ప్రజా ప్రయోజనాల కోసం ఆయన పునరంకితమయ్యారని జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తీవ్ర విషాదం నింపింది. ప్రజా పోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి అని నారా లోకేశ్ సంతాపం తెలిపారు.
సీపీఎం అగ్రనేత ఏచూరి మరణం పట్ల కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజుజు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి మరణం నన్ను కలచివేసింది. ఆయన నాకు మంచి మిత్రుడు. నికార్సయిన కమ్యూనిస్టు యోధుడు. విద్యార్థి ఉద్యమాల్లో చురకైన పాత్ర పోషించిన ఏచూరి.. దేశ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. గొప్ప వక్త. వామపక్ష ఉద్యమాలకు దిక్సూచి. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. నేటి తరం నేతలు ఆయన పంథాను ఆదర్శంగా తీసుకొని అంతరాల్లేని సమాజం కోసం కృషి చేయడయే నిజమైన నివాళని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. సీతారాం ఏచూరి ప్రజల తరఫున బలమైన గొంతుకగా పనిచేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏచూరి అంటే ఒక వ్యక్తి కాదు.. శక్తి. దేశంలోని అగ్ర నాయకుల్లో ఒకరైన ఆయన అందరితోనూ ఆప్యాయంగా మెలిగేవారు. పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తుంటే.. అందరూ ఆసక్తిగా వినేవారు. సభ్యులు ఆ అంశాలను నోట్ చేసుకొనేవారు. మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆయన ఆశయ సాధనలో నడవాలని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయల్లో కీలక పాత్ర
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1974లో ఎస్‌ఎఫ్‌ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాధమిక సభ్యుత్వంను తీసుకున్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1985లో పన్నెండవ పార్టీ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పి సుందరయ్య, ఇఎంఎస్, బిటిఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య మరియు జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు. 1992లో జరిగిన 14వ పార్టీ కాంగ్రెస్ సెషన్‌తో పొలిట్‌బ్యూరోకు చేరుకున్నారు.మతతత్వం,నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఏచూరి క్రమం తప్పకుండా పార్లమెంటులో జోక్యం చేసుకున్నారు. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్టాండిరగ్ కమిటీ చైర్మన్‌గా ముఖ్యమైన నివేదికల తయారీకి ఆయన నాయకత్వం వహించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 2004లో మొదటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో ఏచూరి కీలకపాత్ర పోషించారు. భారతీయ రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రజా ఉద్యమాలకు తాత్విక స్పష్టతతో తీర్చిదిద్దే రాజకీయ, సంస్థాగత బాధ్యతను నిర్వర్తించిన నాయకుడు ఏచూరి. ఆయన భార్య ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి సీమా చిస్తీ. బ్రిటన్‌లో యూనివర్సిటీ టీచర్‌గా పనిచేస్తున్న అఖిలా ఏచూరి, జర్నలిస్టు ఆశిష్ ఏచూరిల పిల్లలు. పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కోవిడ్19 సమస్యలతో 2021లో మృతి చెందారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం మరియు బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఏచూరి లెప్ట్ హ్యాండ్ డ్రైవ్, వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర, సోషలిజం ఇన్ ట్వంటీ
ఫస్ట్ సెంచరీ, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం మరియు ఘృనా కీ రాజనీతి (హిందీ) వంటి పుస్తకాలను రచించారు.రచయితగానూ మంచి గుర్తింపు ఉంది. ’లెప్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరిట ఓ ఆంగ్లపత్రికకు కాలమ్స్ రాశారు. ’క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ’సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ’మోదీ గవర్నమెంట్: న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ’కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.