ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ లను శాస్త్రీయంగా వర్గీకరించాలి

0
51
Reservations for SCs and STs should be classified scientifically.
Reservations for SCs and STs should be classified scientifically.
  • *ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలి
  • *రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వాదులు రెచ్చగొట్టె వాఖ్యలు చేసి అణగారిన కూలాల మధ్య మరింత అగాధాన్ని పెంచవొ ద్దు
  • *డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
  • సుప్రిం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ,ఎస్ఠి ల పై నేటికి కొనసాగుతున్న. అంటరానితనం, కుల వివక్ష , అణచివేత సామాజిక,ఆర్ధిక రాజకీయ రంగాలలో అభివృద్ధి పై అధ్యయానానికి ప్రత్యేక జాతీయ స్ధాయి కమిషన్ వేసి ఎస్సీ ,ఎస్టి లరిజర్వేషన్ లను శాస్త్రియంగా జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. అదె విధంగా కులగణన చెపట్డాలన్నారు.అణగారిన కులాల మధ్య మరింత అగాధాన్ని పెంచెందుకు మనువాదులు అగ్రకులాలు చేసె కుట్ర ,మాయలో పడి రిజర్వేషన్ అనుకూల,వ్యతిరేక వాదులు రెచ్చగొట్డె వాఖ్యలు చెయకుండా సహనంతో ప్రజాస్వామ్యయుతంగా వ్వవహరించాలన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ,వివక్ష వల్ల రిజర్వేషన్ ఫలాలు అందక నేటికి ఊరికి దూరంగా అంటరానితనం, అవమానాలు ఆకలి కి గురవుతు స్ధిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్న ఎస్సీ, ఎస్టీ కులాలకు,కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత గా వర్గీకరణ ఫలాలు అందించాలన్నారు.భారత రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా గా వాటాను పంచుకొని కొటాను పెంచుకుందా మన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదికన కాకుండా తెలంగాణ కొణం లో వర్గీకరణ జరగలన్నారు.రాష్ట్రం లో సైతం ఎస్సీ ఎస్టీ స్ధితిగతుల అధ్యయానానికి కమిషన్ వెసి పెరిగిన జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ లను పెంచాలన్నారు.ఎస్సీ,ఎస్టీ ల రిజర్వెషన్లను రాష్ట్రం లో పెంచుతామనె హమిని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకొవాలన్నారు.క్రిమిలేయర్ ను కేవలం ఎస్సీ ఎస్టీ ల కె పరిమితం చెయకుండా ప్రధాన మంత్రి పదవి నుండి అన్ని స్ధాయిలలో న్యాయ,పరిపాలన,విద్య,ఉద్యోగ రాజకీయ రంగాలలో అన్ని కులాలలో క్రిమిలేయర్ ను అమలు చెయలన్నారు. తరతరాలుగా అనధికారంగా రిజర్వెషన్ లను అనుభవిస్తున్న అగ్రకులాలకు క్రిమిలెయర్ గురించి మాట్లాడె అర్హత లేదన్నారు. అన్ని రంగాలలో అగ్రకులాలు తిష్ఠ వేశాయన్నారు.డాక్టర్ అంబేద్కర్ అందించిన రిజర్వెషన్ లను పొంది ఉన్నత స్ధాయిలో వున్న కుటుంబాలు రిజర్వెషన్ లను స్వచ్చంధంగా వదులుకొని నేటికి అభివృద్దికి దూరంగా వున్న తోటి ఎస్సీ ఎస్టీ లు అవకాశాలు అందుకునె విధంగా ప్రయత్నించాలన్నారు.. అగ్రకులాలు పొందుతున్న ఇడబ్లుఎస్ ముసుగులో అగ్రకులాలకు వున్న 8 లక్షల అదాయ పరిమితిని ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సైతం పెంచాలన్నారు. ఇడబ్ల్యు ఎస్ రిజర్వేషన్ లలో వర్గీకరణ చేయకుండా,ఎస్సీ,ఎస్ఠిల వర్గీకరణ గురించె నిరంతరం చర్చలో పెట్టి ఎస్సీ,ఎస్ఠి ల మధ్య వైరధ్యాన్ని అగ్రకులాలు,పాలకులు సృష్ఠిస్తు తమ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకునె కుట్రలను తిప్పికొట్టాలన్నారు.ఎస్సీ, ఎస్టీ ల వర్గీకరణ కు కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను రూపొందించాలన్నారు.విద్య,ఉపాధి అవకాశాల పై పార్లమెంటు లో చర్చించి సమగ్ర కార్యచరణనను ప్రకటించాలన్నారు.ఎస్సీ క్రిస్టియన్ లకు ఎస్సీ హొదా కల్పించాలన్నారు.ఇప్పటి వరకు రిజర్వేషన్ లను అనుభవించిన కుటుంబాల వివరాల సేకరణ జరిపి వారికి ప్రాధన్యాత క్రమంలో రిజర్వేషన్ లను కల్పించాలన్నారు. రాజ్యాంగం లోని 341 ఆర్టికల్ పై పార్లమెంటు లో సమగ్రంగా చర్చించి రిజర్వేషన్ ల వివాదానికి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.రిజర్వేషన్ లలో ప్రమోషన్ లను సక్రమంగా అమలు చేయాలన్నారు.
  • ప్రభుత్వ రంగ సంస్ధల ప్రవేటికరణ చెస్తు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చెస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని,ప్రవేటికరణకు వ్యతిరేకంగా ,ప్రవెట్ రంగంలో రిజర్వేషన్ లను అమలు చేయాలన్నారు రిజర్వేషన్ ల పరిరక్షణకు ఉద్యమించాలన్నారు.వర్గీకరణ డిమాండ్ నెరవెరినందున భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్న మనువాద బిజెపి చెర నుండి యంఅర్ పిఎస్ నేత మంద కృష్ణ మాదిగ బయటపడి డాక్టర్ అంబేద్కర్ చూపిన రాజ్యాధికారం కొసం ఐక్యపొరాటానికి సిద్దం కావాలని కొరారు. సమాజ మార్పుకొసం జీవితాలను త్యాగం చేసిన మాలలను మనువాదులుగా చిత్రికరించడం మంద కృష్ణకు తగదన్నారు.యం అర్ పిఎస్ ఉద్యమానికి అనేక మంది మాలలు మద్దతు ఇచ్చారనె విషయాన్ని మరువద్దన్నారు.తోటి అణగారిన కులాల ను శత్రువులు గా,దొపిడి దారులు గా ముద్రలు వేయడం మానుకొవలన్నారు..దళితులు మనువాదానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగ రక్షణకు ఐక్యపొరాటాలు చేయడమే తక్షణ కర్తవ్యం అన్నారు.