ఘనంగా కె.జి.ఎఫ్ ముగింపు సదస్సు

0
37
Grand closing conference of KGF
Grand closing conference of KGF

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్.ఐ.సి.సి.)లో  శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన తొలి కమ్మ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ తో పాటు యుఎస్ఎ, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ తదితర దేశాలతోపాటు తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.  ఆదివారం నాడు రెండో రోజు కె.జి.ఎఫ్ సదస్సును కెజిఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ జెట్టి కుసుమ కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, బళ్లారి బుడా ఛైర్మన్ ఆంజనేయులు, కర్నాటక కమ్మ సంఘం నేతలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత అనన్య సూరపనేని గోవరధనగిరిధారి  కూచిపూడి నృత్యం ఎంతో అలరించింది.  రెండో రోజు కె.జి.ఎఫ్ సదస్సులో కర్నాటక కమ్మ సంఘం కార్యక్రమాలను వీడియో చిత్రప్రదర్శన  ద్వారా వివరించడం జరిగింది. మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు మాట్లాడుతూ పత్రికా రంగంలో హిమ శిఖర సమానులు శ్రీ రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. సదస్సులో రెండు నిమిషాలు మౌనంపాటించి రామోజీరావుకు నివాళులర్పించారు.   కె.జి.ఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ జెట్టి కుసుమ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. సీఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డి కమ్మ సంఘానికి కేటాయించిన 5 ఎకరాల స్థలం సమస్యను పరిష్కరించి భవన నిర్మాణానికి సహకరిస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవనం కార్య రూపం దాల్చేందుకు జెట్టి కృషి చేయాలన్నారు. ఏపీ సీఎం శ్రీ చంద్రబాబు గారి సేవలను కట్టా సుబ్రమణ్యం నాయుడు కొనియాడారు. అమరావతి అభివృద్ధికి సహకరించాలని కమ్మ పారిశ్రామిక వేత్తలకు పిలుపు ఇచ్చారు. ఏటా కె.జి.ఎఫ్ సదస్సు జరపాలని కట్టా తీర్మానం ప్రవేశపెట్టారు. బెంగళూరులో సదస్సు నిర్వహణకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నాటక కమ్మ సంఘం నేతలు తమ సేవలను వివరించారు. కె.జి.ఎఫ్ ద్వారా ఒక వివాహ సంబంధాల పరిచయ వేదిక, ఐఏఎస్  ఉచిత కోచింగ్ కు శిక్షణ సంస్థను ప్రారంభించాలని అఖిల కర్నాటక కమ్మ సంఘం సెక్రెటరీ రామజోగేశ్వర్ రావు సూచించారు. బెంగళూరు సౌత్ సెంట్రల్ కమ్మ సంఘం అధ్యక్షులు రవీంద్ర నాయుడు వీడియో ద్వారా సేవలను తెలిపారు. కమ్మ మహిళా బ్యాంకును ప్రారంభించి 13 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్నామన్నారు. స్కాలర్ షిప్ లు అందుకున్న విద్యార్ధుల ఉన్నతికి పోటీ పరీక్షల కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. తమిళనాడు కమ్మ సంఘం నేతలు బాబు, ప్రసాద్, సుందరం, బాలచంద్రన్, కిలారు రవిచంద్ర తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, వసంత కృష్ణప్రసాద్, గురజాల జగన్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత టి.డి. జనార్దన్, మాజీ మంత్రి వసంత నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, జై తాళ్లూరితోపాటు రూప మాగంటి, ఇమ్మణి రాజేశ్వరి పాల్గొన్నారు. కెజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులను సన్మానించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని, కమ్మవారంతా ఒక వేదికపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గతంలో వైసీపీ తరఫున గెలిచినా విధానాలు నచ్చక టీడీపీలోకి వచ్చి చంద్రబాబు ప్రోత్సాహంతో మళ్లీ గెలుపొందానని చెప్పారు. గతంలో జగన్ సమక్షంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ ల సమావేశంలో అమరావతి వ్యతిరేక బిల్లును ఎదిరించానన్నారు. ఒక కులాన్ని ద్వేషించడం తగదని, మంచితో ఆకట్టుకోవాలని చెప్పారు. ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నా భూమిని నమ్ముకుని ముందుకు సాగామే తప్ప కమ్మ వారు ఎవరినీ దోచుకోలేదని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. కమ్మ వారి తొలివలసలు 400 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా మూలాలు మరచిపోలేదన్నారు. ఎన్టీఆర్ వచ్చార హైదరాబాద్ కు, చంద్రబాబు హయాంలో అమెరికాకు వలసలు పెరిగాయన్నారు. తెలుగుభాషను ప్రస్తుతం విస్మరిస్తున్నారని, స్వదేశంలోనూ, అమెరికాలోనూ మన పిల్లలకు తెలుగు విధిగా నేర్పాలని చెప్పారు. పోస్టింగ్ లు లేని కమ్మ అధికారులకు అవకాశం కల్పిస్తామన్నారు. పల్లెలు బోసిపోతున్నాయని, అందరినీ కలుపుకొనిపోతూ ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. కమ్మ పేద విద్యార్ధులకు చేయూత అందించి ముందంజ వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సమాజం అభివృద్ధిలో కమ్మవారి పాత్ర కీలకమన్నారు. అన్నిరంగాల్లో అందరితో కలిసి ముందడుగు వేయాలన్నారు. గత సర్కార్ లో అభివృద్ధిలేదని, తెలుగు, అమరావతి నాశనం అయిందన్నారు. అమరావతి వ్యతిరేక బిల్లును వసంత కృష్ణప్రసాద్ తో పాటు మరో ఎమ్మెల్యే వ్యతిరేకించారని, ప్రస్తుతం అమరావతిని ఎవరూ కదల్చలేరని , చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్నారు. టీడీపీ నేత టి.డి. జనార్ధన్ మాట్లాడుతూ చరిత్రలో నిలిచే విధంగా కేజీఎఫ్ ను కుసుమ కుమార్  తీర్చిదిద్దారన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఔన్నత్యాన్ని పెంపొందించారని, హ్యూమనిజంతో పేదలకు కూడు, గూడు, పెన్షన్ లకు తొలిసారి చరిత్ర సృష్టించారన్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక భూతాన్ని సమాధి చేశారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటే విజయం అందించిన రెండో నెలలోనే కేజీఎఫ్ సదస్సు నిర్వహణ ప్రశంసనీయమన్నారు. కమ్మ వారి దాతృత్వం చదువులతో అభివృద్ధి ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. వందేళ్ల పోరాటంతో కమ్మ ప్రగతి సాధ్యమైందన్నారు. కమ్మ మహిళల పోరాటంతో భూస్ధాపితం అయిందన్నారు. నిర్మాత చలసాని అశ్వనీదత్ మాట్లాడుతూ అన్నగారి స్ఫూర్తి ముందడుగు వేద్దామన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ను సన్మానించడం జరిగింది. హాల్ మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్ అధిపతి జై తాళ్లూరి, కాస్ టెక్ అధిపతి పాటిబండ్ల శ్రీధర్, జే ఎ చౌదరి, గ్లోబ్ ఫర్ చేంజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ అనీష్, ర్యాపిడో ఫౌండర్ పవన్ తదితరులు అవకాశాలపై వివరించారు. కమ్మ విద్యార్ధుల స్కాలర్ షిప్ సాఫ్ట్ వేర్ ను జై తాళ్లూరి బృందం వివరించారు. చివరగా వ్యవసాయం అంశంపై చర్చించారు. పలువురు ప్రముఖులను సత్కరించారు.