మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శాఖ మరియు కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ ల నేతృత్వంలో శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో టీయూడబ్ల్యూజె యూనియన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశం లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాద్యులను జర్నలిస్టులు సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని గజమాలతో ఘనంగా సత్కరించారు.అలాగే టీయూడబ్ల్యూజే నూతన రాష్ట్ర కమిటీ లో గ్రేటర్ హైదరాబాద్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్టు నాయకులను ఈ సందర్భంగా సన్మానించారు. కోశాధికారిగా ఎన్నికైన మోతే వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, గౌస్ మొయినుద్దీన్, అనిల్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్, హెచ్ యు జే అధ్యక్షులు శిగ శంకర్ గౌడ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు సలీమ్ పాషా,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కయ్య, మామిడాల రవీందర్ రెడ్డి, క్రమ శిక్షణ కమీటీ కన్వీనర్ తొట్ల పరమేష్, మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షత వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి కరీం, రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.