కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత , కూచిపూడి నృత్య గురువు ప్రొ.అలేఖ్య పుంజాల తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ , ఉపాధ్యక్షులు ఎం.ఏ హమీద్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత , కూచిపూడి నృత్య గురువు ప్రొ.అలేఖ్య పుంజాల రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందదాయకమని, ప్రతిభా పాటవాలు మెండుగా ఉన్న ప్రొ.అలేఖ్య పుంజాల గారు అధ్యక్షురాలిగా రాష్ట్ర సంగీత నాటక అకాడమీకే వన్నె తెస్తారని ప్రగాడంగా విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. అలేఖ్య గారి ఆలోచనావిధానంతో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సంగీత నాటక అకాడమీని విశ్వవ్యాప్తం చేస్తారని ఈ సందర్బంగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.