40 సెకన్లలోనే మేడ్చల్ ఆభరణాల దుకాణంలో దోపిడీ: సీపీ అవినాష్ మహంతి

0
94

హైదరాబాద్ మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్:

హైదరాబాద్‌: బురఖా వేసుకుని ఒకడు.. హెల్మెట్‌తో మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన మేడ్చల్‌లో కలకలం సృష్టించింది. ఈ కేసులో నిందితులను 24గంటల్లోనే అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ‘‘ఈ నెల 20న మేడ్చల్‌ లోని శ్రీ జగదాంబ జువెలర్స్‌ దుకాణంలోకి బురఖా వేసుకుని ఒకరు, హెల్మెట్‌ ధరించి మరో దుండగుడు వచ్చారు. నగలు, నగదు చోరీ చేశారు. 40 సెకన్లలోనే దోపిడీ పూర్తి చేశారు. నిందితులు పారిపోయిన నేపథ్యంలో 200 సీసీ కెమెరాలు పరిశీలించాం. కిలో మీటరు దూరంలో బైక్ వదిలిపెట్టి వారు పరారయ్యారు. ఓయూ, హబ్సిగూడలో బైక్‌లు దొంగలించారు. నిందితులను పట్టుకునేందుకు 16 బృందాలను ఏర్పాటు చేసి గాలించాం. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన చోరీ కేసులో కూడా వీళ్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించాము. నజీం, సోహైల్‌ను అరెస్ట్ చేశాం. చోరీ నిమిత్తం వీరు మూడు సార్లు రెక్కీ నిర్వహించారు. బంగారం షాష్‌ను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడ్డారు’’ అని సీపీ వివరించారు….