సీనియార్టీలో వెనుకబడిపోయి 12 ఏళ్లుగా ఎస్సైలు గానే
.. పాత సీనియార్టీ ప్రకారం పదోన్నతులు ఇప్పించండి
… డిప్యూటీ సీఎంకు 2012 బ్యాచ్ ఎస్ఐల వినతి
మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్ :
ఓకే బ్యాచ్ లో సర్వీస్ లో చేరినా పదోన్నతుల విషయంలో తీరని అన్యాయం జరిగిందని 2012 బ్యాచ్ ఎస్సైలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి తమగోడును వెల్లబోసుకున్నారు. గురువారం హైదరాబాదులో ఉప ముఖ్యమంత్రిని కలిసి 2012 బ్యాచ్ లో 146 మంది ఎస్సైలుగా ఎంపికయ్యామన్నారు. తమ బ్యాచ్ కి చెందిన 42 మందికి ఇన్స్పెక్టర్ లుగా 2021-22 ప్యానెల్ లో పదోన్నతి కల్పించారని వివరించారు. 317 జీవో వల్ల తాము సీనియార్టీలో వెనుకబడిపోయి 12 ఏళ్లుగా ఎస్సైలు గానే పనిచేస్తున్నామన్నారు. తమ బ్యాచ్ కు చెందిన వారికి తాము సెల్యూట్ చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. పాత సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ సమస్యను విని సానుకూలంగా స్పందించారని, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని 2012 బ్యాచ్ ఎస్ఐలు తెలియజేశారు.