10 కోట్లకు చేరువలో చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం

0
97

బీజింగ్‌: ఈ ఏడాది చివరి నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం 10కోట్లకు చేరువ కానుంది. గతేడాదికి 9.9 కోట్లకు చేరిన సభ్యులు 2024 చివరికల్లా 10కోట్లు పూర్తి చేసుకుంటారని తాజా అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది 11.4లక్షల మంది సభ్యులు పెరిగారని, అంటే 1.2 శాతం మేర వృద్ధి చెందిందని పార్టీ సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తెలియజేసింది. 2022లో పార్టీ సభ్యత్వం 1.4శాతం పెరిగి, కొత్తగా 13.2లక్షల మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సభ్యుల్లో 56.2శాతంమంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నవారే వున్నారు. మహిళా సభ్యత్వం 88,300 పెరిగి 30.4 శాతానికి చేరుకోగా, జాతిపరమైన మైనారిటీలు 7.7 శాతంగా వున్నారు. సభ్యత్వం గణాంకాలను నిశితంగా పరిశీలించినట్లైతే, 30ఏళ్లలోపు సభ్యుల సంఖ్య 2022తో పోలిస్తే 0.18శాతం తగ్గింది. 2021తో పోలిస్తే యువత సభ్యత్వం 1.5శాతం మేర తగ్గింది. పార్టీ వ్యవస్థాపక ఉత్సవాల నేపథ్యంలో ఈ డేటాను విడుదల చేశారు.