విద్యార్థులకు ఆరోగ్యం,వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సు
విద్యార్థులు, ప్రతిఒక్కరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి
డోన్ సిద్ధార్థ స్కూల్ హెచ్ ఎం బి. రామకృష్ణ
జూలై 15 న స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి దుర్గాభాయ్ దేశ్ ముఖ్ జయంతి సందర్బంగా మరియువిద్యార్థులకు ఆరోగ్యం,వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సు
డోన్ పట్టణం లోని సిద్ధార్థ స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ యం బి రామకృష్ణ అద్యక్షతన స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయ్ దేశ్ ముఖ్ జయంతి పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా స్కూల్ హెచ్ఎం బి రామకృష్ణ సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. ఈమె 1909వ సంవత్సరం జూలై 15వ తేదీన రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండీ ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్నివయసులవారికీ విద్యాబోధన అందించేవారు.బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ , ఎల్.ఎల్.బి పూర్తిచేసింది.దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. శ్రీ మహాత్మ గాంధీ గారికిి తన వంతుగా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన దుర్గాభాయికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది మరియు పద్మ విభూషణ్ ,నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో నుండి పాల్ జి హాఫ్‌మన్ అవార్డు పొందిన మహోన్నతమైన స్త్రీ మూర్తి. ఈమె మే 9 – 1981 న స్వర్గస్తులైనారు. ఇలాంటి మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధులను ఎల్లవేళల స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని , సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, స్కూల్ హెచ్ఎం బి రామకృష్ణ కోరారు*అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు.చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్