పరిశ్రమలో మృతి చెందిన కిరణ్ కార్మికుడి కుటుంబానికి 40లక్షల ఎక్స్గ్రేషియా

చట్టబద్ధ బెనిఫిట్స్ సుమారుగా 25 లక్షలు

Lఅంత్యక్రియల ఖర్చులకోసం లక్ష రూపాయలు నగదు అందజేత

గుండ్లమాచ్నూర్ ఎఫ్టోరియా (అరబిందో) యూనిట్ 9 పరిశ్రమలో డ్యూటీలో ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం తో సూర్యాపేట జిల్లాకు చెందిన కిరణ్ అనే కార్మికుడు మృతి చెందినాడు..
సిపిఎం సిఐటియు మరియు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కార్మికుల ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చి చర్చలు జరిపింది 40 లక్షల ఎక్స్గ్రేషియా మరియు చట్టబద్ధంగా రావలసిన బెనిఫిట్స్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.. లక్ష రూపాయలు అంత్యక్రియలకు ఖర్చులకోసం నగదు అందజేసింది…
ఈ చర్చల్లో…
*సిపిఎం జిల్లా కార్యదర్శి వరకు సభ్యులు అతిమేల మానిక్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం యాదగిరి పాల్గొన్నారు.