శాస్త్రవేత్త జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ సేవలు చిరస్మరణీయం: డోన్ పి.మహమ్మద్ రఫి

0
112

భయంకరమైన పోలియో మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కొని ప్రపంచ వ్యాప్తంగా పోలియోని తరిమికొట్టిన ఘనత శాస్త్రవేత్త జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ దక్కుతుందని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి అన్నారు. ఇటువంటి మహానుభావులను ఎల్లవేళలా స్మరించుకుంటూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి మంచి ప్రయోగాలు చేసి దేశానికి సేవ చేయాలని ఆయన కోరారు. ఆదివారం జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ వర్థంతి సందర్బంగా
డోన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం లో డోన్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ బాబు, డాక్టర్ ఎం.శశి కుమార్, నర్సింగ్ ఆఫీసర్ వి.సుధారాణి అద్యక్షతన జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను,శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు.
జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ 1914 అక్టోబరు 28 జన్మించారు. ఈయన అమెరికన్ వైద్య పరిశోధకుడు మరియు వైరస్ అధ్యయనవేత్త. ఇతను మొట్టమొదటి సమర్ధవంతమైన క్రియాశూన్య పోలియో వైరస్ టీకాను కనుగొని అభివృద్ధిపరచాడు. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చదువుతున్నప్పుడు సాల్క్ తన మొదటి నుండి పరిశోధనల వైపు మొగ్గు చూపేవారు. ఆయన వైద్య పరిశోధన వైపు
వెళ్లాలనుకున్నాడు. చివరి వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జోనస్ ఎడ్వర్డ్ సాల్క్1995 జూన్ 23 మరణించారు. భయంకరమైన పోలియో మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కొని ప్రపంచ వ్యాప్తంగా పోలియోని తరిమికొట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇటువంటి మహానుభావులను ఎల్లవేళలా స్మరించుకుంటూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి మంచి ప్రయోగాలు చేసి దేశానికి సేవ చేయాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.
ఈ కార్యక్రమంలో డోన్ ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ కళ్యాణ్ బాబు, డాక్టర్ ఎం. శశి కుమార్, నర్సింగ్ ఆఫీసర్ వి. సుధారాణి, ఫార్మసిస్ట్ సుప్రియ, స్టాఫ్ నర్స్ విజయభారతి, మమత, పుష్పలత, కవిత, షాహినా, మణికంఠ, నాగరాజు, మధుశేఖర్, రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.