విద్యాశాఖ మంత్రిని నియమించాలి

0
95

పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి: SFI రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి

SFI హన్మకొండ జిల్లా కమిటి సమావేశం స్థానిక రాంనగర్ ఎస్ఎఫ్ఐ ఆఫీస్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్.ఎఫ్.ఐ రాష్ర్ట అధ్యక్షులు ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్ ఎల్ మూర్తి హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన ఇప్పటికీ విద్యరంగానికి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం బాధాకరం. విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యారంగ సమస్యలు పేరుకపోయినాయి. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో విద్యాశాఖ ఉండడం వలన పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అకడమిక్ ఇయర్ ప్రారంభమైన నేటికీ పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. గత ప్రభుత్వ పాలల్లో విద్యారంగం విధ్వంసానికి గురైంది ఆ అనుభవాల నుండి ప్రభుత్వం మేల్కొని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేసార తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు నెంబర్స్ మెంటల్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు దానితోపాటు అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించి యూనివర్సిటీల అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయల కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన యదేచ్ఛగా ఫీజుల దోపిడికి పాల్పడుతున్నట్లు వాటిని తక్షణమే నియంత్రించాలని కోరారు విద్యాశాఖ అధికారులు కార్పొరేటు విద్యాసంస్థలకు అనుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు. సంక్షేమ వసతి గృహాలకు సంత భవనాలు నిర్మించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్థలపై తక్షణమే రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమించడం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు స్టాలిన్, జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్,జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, అనుష, పరిమళ మడికొండ ప్రశాంత్ బొజ్జ హేమంత్ ఈశ్వర్ జస్వంత్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు