తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కోడె మొక్కు చెల్లించుకోని సేవలో తరించారు. ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం పలికారు.బీజేపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు
కేంద్ర మంత్రి హోదాలో తొలి సారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అడుగుపెట్టడంతో బాణాసంచా పేల్చి సంబురాలు నిర్వహించారు