యువత మాదక ద్రవ్యాల భారిన పడకుండా బంగారు భవిష్యత్తు వైవు అడుగులు వేయాలని డ్రగ్స్ బారిన పడకుండా అందమైన జీవితాలను నిర్మించుకోవాలని వాటికి బానిసలు కాకుండా ఉండాలంటే ధర్మ సేవ స్వచ్చంద సంస్థ సూచిస్తున్నట్టుగా యోగ, ధ్యానం,చేయాలనీ ఆటలు సహజ జీవన శైలి పద్దతిలో ఆహారం తీసుకోవాలని ఇతరుల పట్ల సానుకూల భావంతో ఉండాలని చర్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ అన్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ధర్మసేవ ఆధ్వర్యంలో బుధవారం న్యూక్లియానిక్స్ కంపెనీ సిబ్బంది నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని సిబ్బందితో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎస్సై ఖలీల్ ధర్మ సేవ కో ఆర్డినేటర్లు
ఉమా గుప్త వి.నరేష్,మనోహర్ రావ్ రాములు సౌజన్య సునీల్ నేవీన్ మరియు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు