బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

0
91

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచే అవకాశం ఉందని, అయితే, కమలం నేతలు చెబుతున్నట్లు ఆ పార్టీకి 370 సీట్లు దాటకపోవచ్చని అంచనా వేశారు. ‘మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. 2019 ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈసారి కొంచెం ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు. 370 సీట్లు మాత్రం దాటకపోవచ్చు’ అని అన్నారు.