..ఆ పోరాటంలో ఎవరు కలిసొస్తే వారిని కలుపుకుని పోతాం.
- సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగానూ బీజేపీని నిలువరించటమే తమ పార్టీ ప్రధాన కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు సంబంధించి కలిసొచ్చే అన్ని శక్తులను కలుపుకుని పోతామని ఆయన చెప్పారు.
సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బుధవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తమ్మినేని మాట్లాడుతూ…కేవలం ఎన్నికల సందర్బంలోనె గాక బీజేపీని, దాని మతోన్మాద భావజాలాన్ని అన్ని సమయాల్లోనూ నిలువరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో ప్రజలు దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ, దాని విధానాలకు వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులను కలుపుకుని ముందుకు పోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని రెవంత్ సర్కారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తమ్మినేని ఈ సందర్బంగా విజ్నప్తి చేశారు. ఆర్ధిక పరిస్తితి, నిధుల కొరత పేరిట వాటి అమలును ఎగ్గొట్టే ప్రయత్నం చెయొద్దని కోరారు. రైతు భరోసా, రుణ మాఫీ, పోడు భూములకు పట్టాలు, వ్యవసాయ కార్మికులకు ఆర్ధిక సహాయం, ఇండ్లు, ఇండ్ల పట్టాలు, కార్మికులకు కనీస వేతనాల అమలు తదితర ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం రెవంత్ రెడ్డిని తమ్మినేని కోరారు.