అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు.

ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు పని చేయాలంటే బల్లకింద చేతులు చాపుతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా బుద్ధి మారడంలేదు. తాజాగా ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకి చిక్కారు. పక్కా సమాచారంతో అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న తహసీల్దార్ మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమిని మ్యుటేషన్ కోసం ఎమ్మార్వో రఫీని నంద్యాల చెందిన రైతు కలిశారు. దీంతో 65 వేలు లంచం ఇస్తే పని చేస్తానని తహసీల్దార్ డిమాండ్ చేశారు. అంత లంచం ఇచ్చుకోలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు చెప్పినట్టుగా ఎమ్మార్వో రఫీకి లంచం డబ్బులను ఫోన్ పే ద్వారా పంపారు. వెంటనే రంగంలోకి ఏసీబీ అధికారులు ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. Md రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం నిర్ధారణ కావడంతో శాఖా పర్యమైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసారు.