*ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు*

0
105

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా లోని గిరిజన తెగలకు చెందిన లంబాడా, ఎరుకల, ఇతర ఉప-కులాలు, పేద దళిత విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలల్లో 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి, పదో తరగతి వరకు, ‘పది’ పూర్తయిన వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఇంటర్‌లో కార్పొరేట్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది.

ఈ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే, వారికి ఉచితంగా ప్రయి వేటు పాఠశాలల్లో ‘పది’ వరకు, కాలేజీల్లో ఇంటర్‌ వరకు ఉచితంగా చదువు కునేందుకు అవకాశం దక్కుతుంది.

*సీట్ల కేటాయింపు ఇలా..*

2024-25 విద్యా సంవత్స రానికి జిల్లాలోని బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌ పథకం ద్వారా ప్రవేశాలకు జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ దరఖాస్తులను ఆహ్వాని స్తోంది. జిల్లాకు మొత్తం 46 సీట్లు కేటాయించగా..

అందులో 3వ తరగతిలో 22 సీట్లు, 5వ తరగతిలో 12 సీట్లు, 8వ తరగతిలో 12 సీట్లు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది.

దరఖాస్తు ఫారాలు మేడ్చ ల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాల యంలో అందుబాటులో ఉంటాయి.

*దరఖాస్తులు ఇలా*

దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తుతోపాటు కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి పొందిన బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, 2 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విద్యా ర్థులు ఇతర వివరాలకు 9959159629 నెంబరులో సంప్రదించవచ్చు. ఇక 2024-25లో బెస్ట్‌ అవేల బుల్‌ స్కూల్‌ డే స్కాలర్‌ పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం కోసం 5, 6 ఏండ్ల లోపు షెడ్యూల్డ్‌ కులాల బాల బాలికలను నుంచి జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తు లను ఆహ్వానిస్తుంది.

1వ తరగతిలో ప్రవేశాల కోసం చింతల్‌ లోని ఆర్‌ ఎస్‌కే ఉన్నత పాఠశాల, కుషాయిగూడలోని బ్రిల్లియంట్‌ గ్రామర్‌ హై స్కూల్‌, కూకట్‌పల్లిలోని బ్రిల్లియంట్‌ గ్రామర్‌ హై స్కూల్‌, బోడుప్పల్‌లోని పద్మశ్రీ ఉన్నత పాఠశాలలో సీట్లు కేటాయించారు.

దరఖాస్తుదారులకు మీ-సేవా ద్వారా మేడ్చల్‌ నెటివిటీ సర్టిఫికెట్‌ ఉండాలి. మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలి.

అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతా ల వారికైతే రూ.లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాల వారికైతే రూ.2లక్షల లోపు ఉండాలి.

ఒక్క కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికి మాత్రమే అవకాశం ఉంటుంది. విద్యార్థి వయస్సు 01-06-2014 నాటికి 5-6 ఏండ్లు కలిగి ఉండాలి. కులం, ఆదాయం మీ-సేవా ద్వారా పొంది ఉండాలి. ఈ నెల 18 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్‌ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి…