కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెలరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. సాంకేతిక కారణాలతో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొన్నింటిని దారి మళ్లించామని, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తామని వివరించారు.
నెలపాటు రద్దయిన రైళ్లు ఇవే..
*రైలు నంబరు 17008 కాజీపేట-కాగజ్ నగర్: ఈనెల 17వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు రద్దు చేశారు.
*రైలు నంబరు12757/58 కాగజ్‌నగర్ ఎక్స స్ : ఇరువైపులా ఈనెల 23 నుంచి జూలై 6వ తేదీ వరకు రద్దు.
*రైలు నంబరు 12967 చెన్నై- జైపూర్ జైపూర్ ఎక్స్ ప్రెస్: ఈనెల 23, 25, 30, జూలై 2, 7వ తేదీల్లో రద్దు చేశారు.
*రైలు నంబరు 12968. జైపూర్-చెన్నై: జైపూర్ ఎక్స్‌ప్రెస్: ఈనెల 21,23, 28, 30, వచ్చే నెల 5వ తేదీన రద్దు చేశారు.
*రైలు నంబరు 12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈనెల 27, 29, జూలై 4, 6వ తేదీల్లో రద్దు చేశారు.
*రైలు నంబరు 12976 జైపూర్-మైసూర్: సూపర్ ఫాస్ట్ ఈనెల 24, 26, జూలై 1, 3వ తేదీల్లో రద్దు చేశారు.
*రైలు నంబరు 12539 యశ్వంత్‌పూర్ – లక్నో: ఈనెల 26, జూలై 3వ తేదీల్లో రద్దు చేశారు. “
*రైలు నంబరు 12540 లక్నో- యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్సప్రెస్: ఈనెల 28, 5వ తేదీల్లో రద్దు చేశారు.
*రైలు నంబరు 12577 : భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్: ఈనెల 25, జూలై 2వ తేదీన రద్దు చేశారు.
*రైలు నంబరు 12578 మైసూర్ దర్భాంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఈనెల 28, వచ్చే నెల 5వ తేదీన రద్దు చేశారు.
*రైలు నంబరు 22619 బిలాస్పూర్ త్రివేం డ్రం: తిరునవెల్లి ఎక్స్ ప్రెస్ ఈనెల 25, జూలై 2వ తేదీన రద్దు చేశారు.
*రైలు నంబరు 22620: త్రివేండ్రం – బిలాస్పూర్ ఎక్సప్రెస్ ఈనెల 23, 30వ తేదీల్లో రద్దు చేశారు.
*రైలు నంబరు 22351 పాటలీపుత్ర- శ్రీమాతా వైష్ణో ఈనెల 21, 28 జూలై 5వ తేదీన రద్దు చేశారు.
*రైలు నంబరు 22352 శ్రీమాతావైష్ణో పాటలీ పుత్ర: ఈనెల 24, జూలై 1, 8వ తేదీల్లో రద్దు చేశారు