మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్, ఢిల్లీ:
నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. నీట్ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు.. కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. వీటిని పెండింగ్ పిటిషన్లతో కలిపి జులై 8న విచారిస్తామని పేర్కొంది. మరోవైపు జులై మొదటి వారంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది.