రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలో దళిత మైనర్ బాలుడు బేగరి యాదగిరిని(12) తాళ్లతో కట్టేసి కాళ్లతో తన్ని కులంపేరుతో దూషించి చిత్రహింసలకు గురిచేసిన పెత్తందారుడు రిటైర్డు ఉపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి అతని కుమారుడిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని
పోలీసులు అరెస్టుపై జాప్యం విడాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు
శుక్రవారం షాబాద్ మండలం కేసారం గ్రామంలో బాధిత దళిత మైనర్ బాలుడి కుటుంబాన్ని కెవిపిఎస్ పరామర్శించింది. జరిగిన సంఘటన పూర్వపరాలు బాధితులను అడిగి తెలుకుంది. కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామేల్ ఎం ప్రకాష్ శరత్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ లతో కలిసి ఆయన గ్రామాన్ని సందర్శించారు
అనంతరం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
తమ ఇంటిచెట్టుకు కాసిన జామకాయలు తెంపుకున్నాడనే నెపంతో దళిత మైనర్ బాలుడు బేగరీ యాదగిరినీ తాళ్ళతో కట్టేసి కాళ్లతో తన్ని చిత్రహింసలకు గురిచేసి కులం పేరుతో దూషించిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి అతని భార్య కొడుకు లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
ఆధునిక యుగంలో కూడా ఈ ఆటవిక చర్యలను ప్రభుత్వం పౌర సమాజం ముక్తకంఠంతో ఖండించాలన్నారు.
తమ కుమారుడిని చిత్రహింసలకు గురిజేసిన సదరు మధుసూదన్ రెడ్డిని పంచాయతీకి రావాలని ఆహ్వానించినందుకుగాను బాధిత దళిత కుటుంబ సభ్యులను మధుసూదన్ రెడ్డి కొడుకు వచ్చి కులంపేరుతో దూషించి నానా బూతులు తిట్టినట్లు బాధితులు చెప్పారు
ఈ ఘటన జరిగి 5రోజులు కావొస్తున్న పోలీసులు నేటికి అరెస్ట్ చేయలేదన్నారు
కెవిపిఎస్ తో పాటు సామాజిక సంఘాలు ఆందోళన పోరాటాలు చేస్తే ఏసీపి 48 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అరెస్టు చేయలేదన్నారు
పోలీసులు తక్షణమే నిర్లక్ష్యాన్ని విడనాడి పెత్తందారులైన తండ్రి కొడుకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.జామకాయలు తెంపుకోవడం నేరమైతే చట్టప్రకారంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు కానీ మద్యయుగాల కాలం నాటి పద్ధతిలో పశువుల్ని కట్టేసినట్టుగా ఆ బాలుడిని కట్టేయటమంటే అగ్రకుల ఆధిపత్యం ఎలా ఉందో విధితమవుతుందన్నారు ఈ ఘటనలో ఆ పెత్తందారులకు కఠిన శిక్షలు పడకపోతే మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉందన్నారు చేవెళ్ల ప్రాంతంలో గతంలో జన్వాడ దళితులపై పెత్తందారులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు వరుస క్రమంలో రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఈ దాడులను అరికట్టడంలో పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయగలిగితే దళితులకు ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు పోలీసులు నిర్లక్ష్యాన్ని వీడాలని తక్షణమే ఆ పెత్తందారుల అరెస్టు చేయాలన్నారు కెవిపిఎస్ తరఫున రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డిజిపికి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామన్నారు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని కోరారు
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామేల్ ఎం ప్రకాష్ కరత్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ సిఐటియు షాబాద్ మండల నాయకులు తాళ్లపల్లి నరసింహ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బ్యాగరి అరుణ్ కుమార్ డివిజన్ నాయకులు సాయి గణేష్ కెవిపిఎస్ నాయకులు బి సందీప్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జంగయ్య బాధిత కుటుంబ సభ్యులు బేగరి రాములు అమృత ప్రేమలత యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Home Hyderabad web desk దళిత మైనర్ బాలుడిని తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన పెత్తందారులను తక్షణమే అరెస్టు చేయాలి.అరెస్టు పై...