జీవితంలో సంతోషంగా జీవించి సమాజం పట్ల బాధ్యతతో నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి: జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా

తెలంగాణ వ్యాప్తంగా వివిధ జైళ్ళలో ఉన్న సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు మరియు దీర్ఘకాల జైలు శిక్ష అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్షపై ముందస్తుగా బుధవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని చర్లపల్లి కేంద్రకారాగారం నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరైనారు.

ఈ సందర్భంగా విడుదలవుతున్నటువంటి ఖైదీల అందరికి కేంద్రకారాగారం చర్లపల్లి నందు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అకెళ్ళ రాఘవేంద్ర , ప్రముఖ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ జాస్తి రాజేశ్వరి కౌన్సిలింగ్ నిర్వహించారు.అనంతరం జరిగిన సభలో జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో కొంతమంది ఖైదీల బంధువులు ఖైదీల విడుదల గురించి ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తదనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హై కోర్ట్ జస్టిస్ లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని, జైళ్ళ శాఖ వారు రూపొందించిన ఖైదీల జాబితాలోని ప్రతి ఖైదీ కేసు వివరాలను కమిటీ నిశితంగా పరిశీలించి కేంద్ర రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. స్క్రూటినీ కమిటీ ఆమోదించిన ఖైదీల జాబితాను అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. తదుపరి ప్రతిపాదనను తెలంగాణ గవర్నర్ కి సమర్పించి ఆమోదం పొందారు. తదనుగుణంగా మొత్తం 213 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. అందులో 205 మంది జీవిత ఖైదీలు 8 మంది దీర్ఘకాలిక శిక్ష విధించబడినటువంటి ఖైదీలు 35 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ కి డాక్టర్ సౌమ్యా మిశ్రా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతిపాదనలు ఆమోదించి పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, హోం సెక్రటరీ జితేందర్ కుమార్ కి సౌమ్య మిశ్రా ధన్యవాదాలు తెలియజేశారు.

బుధవారం విడుదలవుతున్నటువంటి ఖైదీలు జైల్లో ఉన్న రోజులలో వివిధ రంగాల్లో వృత్తి విద్యా శిక్షణ, విద్యాభ్యాసం పొందడం జరిగిందని వారు ఆ శిక్షణ ఉపయోగించుకొని విడుదల అనంతర జీవితం లో సంతోషంగా జీవించాలని సమాజం పట్ల బాధ్యతతో నేర రహిత జీవితం గడపాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హైదరాబాద్ రేంజ్ డాక్టర్ శ్రీనివాస్ , విడుదలవుతున్నటువంటి ఖైదీలచే సత్ప్రవర్తనతో చట్టాలకు లోబడి జీవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. విడుదల అవుతున్న ఖైదీలు ప్రభుత్వం మరియు జైళ్ల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాబ్ మేళాలో జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మైనేషన్ ఫ్యూయల్ స్టేషన్లలో మరియు పరిశ్రమలలో పనిచేయుటకు 70 మంది విడుదలవుతున్న ఖైదీలకు జాబ్ ఆఫర్ లెటర్ జైళ్ల శాఖ తరఫున డాక్టర్ సౌమ్య మిశ్రా అందజేశారు. మహిళా జైలు నుంచి విడుదలవుతున్నటువంటి ఎనిమిది మంది ఖైదీలకు ఉషా కుట్టు మిషన్లను వారు అందజేశారు.

ఈ సందర్భంగా జైళ్ళ శాక ఇన్స్పెక్టర్ జనరల్ అడ్మిన్ (అడ్మిన్) వై రాజేష్ , వెల్ఫేర్ ఐజి ఎన్. మురళి బాబు , వరంగల్ రేంజ్ డిఐజి ఎం సంపత్ ఖైదీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రకారాగారము హైదరాబాద్ పర్యవేక్షణ అధికారి నవాబ్ శివకుమార్ గౌడ్, మహిళా జైల్ పర్యవేక్షణ అధికారి లక్ష్మీ గోపీనాథ్, వరంగల్ ఓపెన్ జైలు పర్యవేక్షణ అధికారి కళాసాగర్ లు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంధానకర్తగా చర్లపల్లి జైలు పర్యవేక్షణ అధికారి సంతోష్ కుమార్ రాయ్ వ్యవహరించారు. కార్యక్రమం లో వివిధ జైళ్లకు చెందిన అధికారులు, సిబ్బంది, ఖైదీల బందువులు పాల్గొన్నారు.

వివిధ కారగారాల నుండి విడుదలైనటువంటి ఖైదీల వివరాలు.

  1. కేంద్రకారాగారం చర్లపల్లి 61
  2. కేంద్రకారకారము హైదరాబాద్ 27
  3. కేంద్ర కార్యాలయం వరంగల్ 20
  4. ఖైదీల వ్యవసాయ క్షేత్రం చర్లపల్లి 31
  5. ప్రత్యేక మహిళా కారాగారము హైదరాబాద్ 35
  6. కేంద్రకారాగారము సంగారెడ్డి 1
  7. కేంద్ర కారాగారం నిజామాబాద్ 15
  8. జిల్లా జైలు మహబూబ్నగర్ 02
  9. జిల్లాజీలు ఆదిలాబాద్ 03
  10. ఇలా జైలు కరీంనగర్ 7
  11. జిల్లా జైలు ఖమ్మం 04
  12. స్పెషల్ సబ్ జైల్ ఆసిఫాబాద్ 03
  13. డిస్టిక్ జైల్ నల్గొండ 04

మొత్తం 213.