తెలంగాణ-బంగాళాఖాతం మధ్య ఆవర్తన ద్రోణి: ఐఎండీ

0
87

మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నెల 5న మహబూబ్‌నగర్‌ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనిఅధికారులు పేరొన్నారు. కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లా ల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేరొన్నది.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..

నల్లగొండ జిల్లా కంపాసాగర్‌లో అత్యధికంగా 7 సెం.మీ, నిడ్మనూర్‌లో 5, మిర్యాలగూడలో 3, జోగులాంబ-గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 6, ఐజాలో 2, నిజామాబాద్‌ జిల్లా నవీపేట, రంజల్‌, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 3 చొప్పున, తడ్వాయి, సంగారెడ్డి జిల్లా న్యాకల్‌, మెదక్‌ జిల్లా రామాయంపేట, సూర్యాపేటలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.

లానినా ప్రభావంతో ముమ్మరంగా వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో నిరుడు నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారి సీజన్‌ ఆరంభంలోనే ఆశాజనకం  లానినా, హిందూ మ హాసముద్రంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పాజిటివ్‌గా మారతుండటం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెప్తున్నా రు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. జూ న్‌లో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. రికార్డు ఉష్ణోగ్రతలతో ఉకిరిబికిరి చేసిన ‘ఎల్‌నినో’ దశ ముగిసిపోతున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.