కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఒక ప్రత్యామ్నాయ విధానమే లక్ష్యంగా నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా శ్రేయసే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ ముందుంటుందని తెలిపారు . దేశం కోసం నేతాజీ ప్రజల కోసం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని నినాదంతో ఎంతో గాను ముందుకు వెళ్లి రాజకీయంగా ఎన్నో విజయాలను సాధించినట్లు తెలియజేశారు. భారతదేశం స్వాతంత్రం సాధించడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో గాను కృషి చేశారని వారి సేవలు ప్రజలు ఎప్పటికీ మరువరు అని వారి సేవలను కొనియాడారు. దేశంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రజా సమస్యలపై నాటినుండి నేటి వరకు 85 సంవత్సరాలుగా పోరాటమే లక్ష్యంగా పూర్తిగా నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు .
నిట్ పరీక్షలో జరిగిన పేపర్ లైకజి పై, అవకతవకలపై సుప్రీంకోర్టు జరిగితే విచారణ జరిపించి నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించాలని, NTA ను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జూలై మొదటి వారంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక ఉద్యమాలను పోరాటం చేయనున్నట్లు తెలిపారు. జూలై మొదటి వారంలో విద్యారంగ సమస్యలపై, ప్రజా సమస్యలపై ,మహిళా, యువజన సమస్యలపై ,పోరాటాలకు సన్నద్ధమవుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, ప్రశాంత్ కుమార్, విద్యార్ధి సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్, యువజన సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రినేత టియు సిసి నాయకులు పాల్గొన్నారు.