ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలు అమలుకు పూనుకోవాలి.

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకుపై ఉద్యమాలకు సిద్ధం కావాలని, రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య కోరారు. శుక్రవారం స్థానిక పెరుమాండ్ల జగన్నాథం భవన్లో జరిగిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని గతం కంటే ప్రజాదరణ తగ్గిందని, సీట్లు తగ్గాయని, తగ్గడానికి కారణాలు బిజెపి ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు అని ఆయన అన్నారు. జిఎస్టి, పెద్ద నోట్ల రద్దు, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాల వల్ల దేశంలో బిజెపికి ప్రజల్లో బలం తగ్గిందని 400 సీట్లు వస్తాయనుకున్న బిజెపికి 240 మాత్రమే వచ్చాయని, తన ఎన్డీఏ కూటమి కలుపుకుంటే 292 సీట్లు వచ్చాయని, ఆయన రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకున్న మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు తగిన విధంగా తీర్పు ఇచ్చారని నాగయ్య తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వంద రోజులు పూర్తి అవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం తగిన విధంగా లేదని రైతులకు రుణమాఫీ అమలు చేయలేదని నాట్ల సీజన్ కాబట్టి రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరారు. పెన్షన్లను కూడా పెంచలేదని వాటిని వెంటనే పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇతర హామీలు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, అల్వాల వీరయ్య, శెట్టి వెంకన్న, ఆకుల రాజు, గునగంటి రాజన్న, మండ రాజన్న, సమ్మెట రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.