ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 171వవారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్యఅతిథిగా గ్యారా శిరీష, బిఎ.,ఎల్ఎల్బి., (న్యాయవాది, మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు) విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. శిరీష గారు మాట్లాడుతూ ఈరోజు కారంచెడు మరణకాండ జరిగి 39 సంవత్సరములు గడుస్తున సందర్భంగా ఆ మృతవీరులకి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మరణకాండలో మరణించిన తేలా మోషే, తేల ముత్తాయ, తేల యెహోషవా, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహం, దుడ్డు అలిసమ్మ గార్ల పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని తెలియజేసారు, ఆ మహనీయుడు బౌతికంగా మనతో పాటు లేకపోవచు కానీ భారత రాజ్యంగా రూపములో ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు తొడుగ నిడగా ఉంటారు అని తెలియజేసారు.
నేను ఏంచుకునా న్యాయవధ వృత్తిని నేను ఒక బాధ్యాతగా భావిస్తా, అనుక్షణం బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం పాటుపడతా, డా.బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాద వృత్తిని సమాజం బాగు కోసం ఒక రకంగా ఉపయోగించారు నేను కూడా ఆయన బాటలోనే నడుస్తా. జై భీమ్ సినిమాలో జస్టిస్ కె చంద్రు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకుకెళ్తా అని తెలియజేసారు. ఇలా ప్రజలని చైతన్య పరుస్తున్న యం.అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మేకల దాస్ గారికి కన్వీనర్, ఎస్సీ సెల్, మేడ్చల్ మల్కాజిగిరి పదవీ బాద్యతలు స్వీకరించిన సందర్బంగా వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

                                     కారంచేడు మారణకాండకు నేటితో 39 ఏళ్లు గడుస్తున సందర్బంగా ఆ మృతవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించరు. ఈ సందర్భంగా డి.భరత్ కారంచెడు మరణకాండ గురుంచి సవివరంగా వివరించారు. 17 జూలై 1985 నాడు అగ్రకుల అహంకారం కట్టెలు తెంచుకుంది, దళిత వాడ పై దండయాత్ర చేసింది. రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన ఘటన కారంచేడు. హరిత విప్లవం సాగిన ప్రాంతాల్లో దాని వల్ల బలపడిన శూద్ర అగ్రకులాలు దళితుల మీద సాగించిన దాడిగా దీనికి సామాజిక క్రమంలో ప్రాధాన్యముందని విశ్లేషకులు భావిస్తారు. తెలుగు నేల మీద జరిగిన ప్రధాన దాడులు కారంచేడు, చుండూరు. రెంటిలోనూ పారిన నెత్తుటికి నీటి పారుదల కాల్వలు సాక్ష్యంగా ఉండడం సామాజిక పరిణామంలో కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. జూలై 17 నాటి దాడికి ముందే గ్రామంలో మాలలపై దాడి జరిగింది. దాంతో వారు చీరాల వెళ్లిపోయారు. ఎరుకల మీద దాడి చేశారు. వారు కూడా ఊరు వదిలిపోయారు. ఇక మిగిలింది మాదిగలు, వారిని చాలా సార్లు వేధించారు. చివరకు క్రిస్మస్ నాడు కొత్త బట్టలు కట్టుకుంటే కూడా సహించలేకపోయారు. అన్నింటికీ పరాకాష్ఠగా జూలై 17 నాడు చెరువు గట్టున మున్నంగి సువార్తమ్మ, వికలాంగుడైన చంద్రయ్య తాగునీటి చెరువులో వ్యర్థాలను కలపడాన్ని ప్రశ్నించడం సహించలేకపోయారు. చెర్నకోల్ దాడిని బిందె అడ్డుపెట్టి సువార్తమ్మ అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి వియ్యంకుడి ఊరిలోనూ మాదిగలు ఎదురుతిరుగుతున్నారని తల్లడిల్లిపోయారు. దాంతో నాలుగైదు గ్రామాల వాళ్లు కలిసి దగ్గుబాటి చెంచురామయ్య ఇంట్లో మీటింగ్ పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా దాడి చేశారు. కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డళ్లు సహా మారణాయుధాలు పట్టుకుని తెగబడ్డారు, వెంటాడి వేటాడారు. ఒక్కొక్కరి ఒంట్లో 140 పోట్లు కూడా పొడిచారంటే ఎంత దుర్మార్గమో ఆలోచించండి అంటూ వివరించారు నాటి ఉద్యమ నాయకులు కత్తి పద్మారావు. ఆమరణ దీక్షకు పూనుకున్న తేళ్ల జడ్సన్ వంటి వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అనేక సామాజిక పోరాటాలకు కారంచేడు స్ఫూర్తిగా నిలిచింది. ప్రభుత్వ నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా 15 ఎకరాల భూమి కొని బాధితులకు అందించారు. దాని కొనుగోలులో అనేక మంది చేయూత అందించారు. చివరకు ప్రభుత్వం సంపూర్ణ ప్యాకేజీ అందించే వరకూ పోరాడి సాధించారు. ఆ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా రూపొందించుకోగలిగాం అని పద్మారావు చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిరావడానికి మహిళల పోరాటమే మూలం, జూలై 17 నాటి ఘటనల తర్వాత వరుసగా ఉద్యమాల వేడి రాజుకుంది, ఘటనపై దేశమంతా ఆందోళనలు మిన్నంటాయి. వివిధ సంఘాలు ఐక్యంగా ఉద్యమాలకు దిగారు, అందులో భాగంగా దళిత మహాసభను ఏర్పాటు చేశారు. కత్తి పద్మారావు నేతృత్వంలో ఏర్పడిన ఐక్య పోరాట కూటమిలో వివిధ సంఘాలు భాగస్వాములయ్యారు. చీరాలలో సెప్టెంబర్ 1న చీరాలలో జరిగిన బహిరంగ సభతో మరింత ఉద్ధృతమయ్యింది. సెప్టెంబర్ 10న బంద్ కూడా జరిగింది, మధ్యలో రాస్తారోకోలు, రైల్ రోకోలు వంటి రూపాల్లో నిరసనలు సాగించారు. అక్టోబర్ 6న విజయవాడలో బహిరంగసభ జరుగుతుండగా లాఠీచార్జ్ కూడా జరిగింది. సభలో ప్రసంగిస్తుండగా కత్తి పద్మారావుని వ్యాస్ సారధ్యంలోని పోలీసులు అరెస్ట్ చేసి, అడ్డుకున్న అనేక మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ కి చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 27న మహిళలు హైదరాబాద్ కేంద్రంగా సాగించిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నాటి సీఎం ఎన్టీఆర్ ఇంటిని ముట్టడించి, ఆయన బయటకు వచ్చి నిరసనకారుల డిమాండ్లపై స్పందించే వరకూ కదిలేది లేదంటూ 600 మంది మహిళలు బైఠాయించడం పెద్ద సంచలనంగా మారింది. అప్పటికే విజయవాడలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ మహిళలు మాత్రం ముందుకు కదిలారు. వారి చైతన్య స్ఫూర్తితో నేరుగా అసెంబ్లీ వద్ద సీఎంని అడ్డుకోవాలని అనుకున్నప్పటికీ సమాచారం అందుకుని సీఎం ఎన్టీఆర్ అబిడ్స్ లోని తన ఇంటికే వెళ్లిపోయారు. దాంతో మేము కూడా అక్కడికే వెళ్లి ఇంటి ముందు బైటాయించారు. గంటల కొద్దీ గడుస్తోంది. పోలీసులు మమ్మల్ని బెదిరించినా వెనక్కి తగ్గలేదు, చివరకు సీఎంతో చర్చల కోసం అంటూ బొజ్జా తారకం సహా కొందరు మహిళలను ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపల కాదు, బయట ప్రజల్లోకి రావాలని పట్టుబట్టి ఆయన రోడ్డు మీదకు వచ్చేలా చేసారు. రెండు గంటల పాటు ఘెరావ్ చేసి 28 డిమాండ్లకు ఆయన అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసేలా చేసారు. చివరకు ఎస్ ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో హామీలన్నీ అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని పెట్టిన డిమాండ్ కూడా ఎన్టీఆర్ అంగీకరించాల్సి వచ్చింది. దగ్గుబాటి చెంచురామయ్య 1989లో హత్యకు గురయ్యారు. తామే హత్య చేసినట్టు, కారంచేడు ఘటనకు బాధ్యుడిగా, ఆ దాడికి ప్రతీకారంగా హత్య చేసినట్టు పీపుల్స్ వార్ ప్రకటించింది. ఈ కేసులో ఐదుగురికి మరణి శిక్ష విధిస్తూ 1994లోనే గుంటూరు సెషన్స్ కోర్ట్ తీర్పు చెప్పింది. ఆ తర్వాత కొందరికి క్షమాభిక్ష లభించింది. మీడియా సహకారం బాధితులు కులం, మతం వంటి విబేధాలను పక్కనపెట్టి ఒక్కటిగా ముందుకు కదిలితే ఉద్యమాలు ఎలాంటి ఫలితాలు సాధిస్తాయన్నది కారంచేడు నిరూపించిందన అని తెలియజేసారు. బాధితులకు న్యాయం జరిగేందుకు శంకరన్ కృషి హైదరాబాద్ లో సీఎం ఇంటిని మహిళలు ముట్టడించిన సమయంలో ఇచ్చిన పునరావాస ప్యాకేజీ అమలు బాధ్యతను సీనియర్ అధికారి ఎస్. ఆర్ శంకరన్కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలోనే 1986 ఫిబ్రవరి 16న చీరాల ఐఎల్ టీడీని ఆనుకుని విజయనగర్ కాలనీకి శంకుస్థాపన జరిగింది.ఇక బాధిత కుటుంబాల్లో ఆర్హులకు ఉద్యోగాలు, రెండు ఎకరాల భూమి, అందరికీ ఇళ్ల నిర్మాణం, ఉపాధి కోసం స్వయం కృషి సంస్థ ఏర్పాటు వంటి హామీలన్నీ అమలులో శంకరన్ బృందం చొరవ బాధితులకు ఉపయోగపడింది. ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు ఈ కేసులో ఒంగోలు ట్రయల్ కోర్టు 159 మందికి జీవిత ఖైదు విధించింది. కానీ దాన్ని ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చివరకు 1998 అక్టోబర్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. సరిగ్గా పదేళ్లకు అంటే 2008 డిసెంబర్ 19న, సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో ఇక మిగిలిన వారిలో ప్రధాన నిందితుడు అంజయ్యకు జీవిత ఖైదు, మరో 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మరణకాండలో మరణించిన తేలా మోషే, తేల ముత్తాయ, తేల యెహోషవా, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహం, దుడ్డు అలిసమ్మ గార్ల పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను ముందుకు తీసుకువెళ్లాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎం.అరుణ్ కుమార్. 
                     ఈ రోజు సూక్తి సచిన్ చెప్పారు : జీవితం సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలి అని అంబెడ్కర్ గారి మాటలు గుర్తుచేశారు.               
                                           ఈ కార్యక్రమం లో మేకల దాస్(కన్వీనర్, ఎస్సీ సెల్, కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ మల్కాజిగిరి), కట్కూరి నర్సింగ్ రావు(అద్యక్షులు, గంగపుత్ర సంఘం), ఈరిటం శ్రీనివాస్(ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ యువజన సంఘం), మోతుకుపల్లి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ), గంగారాం అంజయ్య, బాల్నగర్ గణేష్ గౌడ్, కృష్ణం రాజు, చిలుగూరి ఆనంద్, విష్ణు, భరత్, సచిన్, అఖిల్, ప్రవీణ్, సాయి చరణ్, వివేక్, యాకేష్ తదితరులు పాల్గొన్నారు.