తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎం.ధర్మ నాయక్ డిమాండ్
మెరుగైన వైద్యం అందించి
ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి
కొల్లాపూర్ నియోజక వర్గం మూలచింతలపల్లి గ్రామ నివాసి కాట్రాజ్ ఈశ్వరమ్మ పై సమాజం తలదించుకునే విధంగా దాడికి పాల్పడేటువంటి బండి వెంకటేశం,బండి శివ, సలేశ్వరమును కఠినంగా శిక్షించాలని. ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్, వి.రామ్ కుమార్, ఏ. కృష్ణా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కాట్రాజ్ ఈశ్వరమ్మను(25) పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కొల్లాపూర్ నియోజక వర్గం మూలచింతలపల్లి జీవిస్తున్నటువంటి
నిరుపేద చెంచు తెగకు చెందిన మహిళపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడే విధంగా వ్యవహరిస్తూ ఆమెపై అర్థ రాత్రి 12 గంటలకు అందరూ పడుకున్న సమయంలో పచ్చిమిర్చి కారం తీసుకొచ్చి తన ప్రైవేట్ భాగాలపైన రాస్తూ, కంట్లో మిరపకాయ పొడి పెడుతూ విపరీతంగా కొట్టడం ప్రారంభించారు.దీంతో పాటు ప్రైవేటు భాగంలో డీజిల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం కూడా చేశారని బాధితురాలు రోదిస్తుంది. బట్టలు ఊడదీసి అనేక చిత్ర హింసలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారన్నారు. పది రోజులపాటు నిర్బంధించి విపరీతంగా చిత్రహింసలు పెట్టారని అన్నారు.చెంచు తెగకు చెందిన ఈశ్వరమ్మ పొలాన్ని బండి వెంకటేశం బండి శివ సలేశ్వరం కౌలుకు తీసుకొని తమ పంట పొలాలలో పంటలు పండించుకుంటూ తమనే వెట్టిచాకిరి చేయించే పని చేస్తూ తమ చేతుల కింద పనిచేయలేదని కక్ష సాధింపుగా దాడికి పాల్పడ్డారనీ తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెంచు తెగకు చెందిన గిరిజన మహిళకు న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళకు మెరుగైన వైద్యం అందించాలని,
మూడు ఎకరాల భూమి 25 లక్షలు, ఒక ఇల్లు, ముగ్గురు పిల్లలకి రెసిడెన్షియల్ సీటు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర . నాయకులు వీ.రాం కుమార్ నాయక్, ఏ. కృష్ణ నాయక్ తదితరులు పరామర్శించారు.