ఓయూలో జర్నలిస్టులపై పోలీసుల దాడి- అక్రమ అరెస్టు-ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

0
98

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వెయ్యాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దానిని న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) రాష్ట్ర అద్యక్షులు మామిడి సోమయ్య , ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరించి, వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసు స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడిన పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో జర్నలిస్టుల పై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదిలేదని వారు హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులపై ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా అరికట్టేందుకు ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి చొరవచూపాలని వారు కోరారు.