యూత్ జనరేషన్ కు సరికొత్త కంటెంట్ తో కొత్తవారైనా గానీ , ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం సాహసోపేతమైన ప్రయత్నమే జరిగింది.
ఈ చిత్రంలోని హీరో,హీరోయిన్లు కొత్త వారైనప్పటికీ అనుభవమున్నట్లుగానే బాగా చేశారు.మిగతా
సీనియర్ నటీనటులు కూడా బాగా ఒదిగి పోయారు.
సూర్యరాజ్,మెరీనాసింగ్,రాగిణి,
చిత్రంశ్రీను,జోష్ రవి, లిరిశా ( సూపర్ఉమెన్ ),చిట్టిబాబు,సద్దాం హుస్సేన్,పొట్టి రియాజ్ మొదలగు వారు నటించారు.
ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పై
పి.బి.మహేంద్ర నిర్మించగా…
సంగీతం: మహావీర్ ఏలెందర్, సిమాటోగ్రఫీ: రమా శ్రీనివాస్,ఎడిటింగ్: కొడగంటి వేణు, దర్శకత్వం: రవీందర్ సూగూరి.
కథేంటంటే :
ఈ రోజుల్లో మన కళ్లముందు జరుగుతున్న వాస్తవిక దృశ్యాలనే
దృష్టిలో పెట్టుకొని ” ఐ20″ Beware of Girls అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన సినిమా ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పి.బి.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో
నిర్మించగా రవీందర్ సూగూరి దర్శకత్వం వహించారు. లిరిక్ రైటర్
S S దేవేంద్ర అందించిన మంచి సాహిత్యానికి ,సంగీత దర్శకునిగా
మహావీర్ యేలెందర్ సమకూర్చిన
స్వరాలు సైతం అందరినీ ఆకట్టుకునీ శ్రోతలకు వీనుల విందుగా నిలిచాయి.ఇకపోతే కథా పరంగా చూస్తే,మదమెక్కిన మగాళ్ళ ధాటికి బలైన అమ్మాయిలకు న్యాయం జరగడానికి మహిళా సంఘాలు ,పోలీసు బలగాలు ,నిర్భయ చట్టాలు హుటాహుటిన పరుగెత్తు కొస్తాయి.
మరి అదే అమ్మాయిలచేత నమ్మి
మోసపోయిన అబ్బాయిలకు సపోర్ట్ గా ఎవరూ పరుగెత్తరు. మోసపోయినవాడు మాసిన గడ్డాలతో పిచ్చోడై తిరిగినా, మోసానికి తట్టుకోలేక ప్రాణాలను
వదిలినా కనీసం కనికరం కూడా చూపని ఈ సమాజంలో అబ్బాయిలకు చట్టాలు చుట్టంగా
ఎందుకు మారడం లేదు. అంటే అబ్బాయిలవి ప్రాణాలు కాదా , వారికి తలిదండ్రులు వుండరా…
మోసానికి బలైన అబ్బాయిలు
మోసం చేస్తున్న అమ్మాయిలకు
ఏ సమాధానం ఇచ్చారో ఉత్కంఠగా
సాగే దృశ్యాలను ప్రతి భాషలో వున్న ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. నిర్మాతకు సక్సెస్ ను ఇచ్చారు.చిత్ర యూనిట్ తో పాటు నిర్మాత పి.బి.మహేంద్ర ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ కు
పట్టం కడతారని గతంలో వచ్చిన
బేబి నిరూపించింది.అందుకే “ఐ20” సినిమాను కూడా ఆదరించి సక్సెస్ ను అందించారు.
బలాలు:
- కథ,స్క్రీన్ ప్లే
+కొడుకుగా హీరో,తల్లిగా రాగిణి
నటన బాగుంది.
+సెకండ్ ఆఫ్ లో ట్విస్టుతో
కూడిన ఐ20 టైటిల్ రివీల్
చాలా బాగుంది.
బలహీనతలు :
_ నెమ్మదిగా సాగే ఫస్టాఫ్
_ కొన్ని హింసాత్మక సన్నివేశాలు
_ దర్శకత్వంలో ఇంకా మెళుకువలుండాలి.
చివరగా :
అబ్బాయిలను మోసం చేసి వారి జీవితాలతో ఆడుకునే అమ్మాయిలకు తగిన గుణపాఠం.
రేటింగ్: 3.75/5