🕉️తిరుమల తిరుపతి దేవస్థానం లో మళ్ళీ క్యూ ..కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో మొదలైన అన్న ప్రసాదం పంపిణీ….

0
95

ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు…

తిరుమల తిరుపతి దేవస్థానం లో
మళ్ళీ క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో మొదలైన అన్న ప్రసాదం పంపిణీ….
ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు…
ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు… ప్రత్యేకించి పిల్లలు, సుగర్ పేషెంట్లు, ముసలోళ్లకు దీని విలువ బాగా తెలుసు ఎంతో…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా కొత్తగా నియమితులైన శ్యామలరావు భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా కొత్తగా నియమితులైన శ్యామలరావు భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు. భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే వాటిని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే దివ్యదర్శనం టోకెన్లను శ్రీవారి 1200 మెట్టు వద్ద స్కానింగ్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించాలి.

క్యూ లైన్ లో ఉన్న…
దీంతో పాటు తాజాగా కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం పంపిణీని ప్రారంభించారు. గతంలో ఈ కార్యక్రమం ఉండేది. అయితే అప్పుడప్పుడు భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడే అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తూ వచ్చారు. శ్రీవారి సేవకులు, సిబ్బంది ద్వారా ఈ అన్నప్రసాదాలను క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు పంపిణీ చేస్తున్నారు. అయితే శుక్రవారం నుంచి ప్రతిరోజూ క్యూ లైన్లలో అన్నప్రసాదం పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో భక్తులుఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు… ప్రత్యేకించి పిల్లలు, సుగర్ పేషెంట్లు, ముసలోళ్లకు బాగా తెలుసు దీని విలువ ఎంతో…దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.