శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీవారి కల్యాణ మహోత్సవము

0
119

మేడ్చల్ మల్కజ్గిరి  జిల్లా జిల్లా కాప్రా సర్కిల్ కుషాయిగూడ 4వ డివిజన్ H. B కాలనీ
మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  బుధవారం శ్రవణా నక్షత్రం సందర్భంగా *శ్రీవారి కల్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు  మాట్లాడుతూ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున లోక కళ్యాణార్థం ప్రజలందరూ ఆయురారోగ్యాలు,సుఖ సంతోషాలతో ఉండాలని  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పడం జరిగింది. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ శ్రీ శ్రీనివాస స్వచ్ఛంద అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో **అన్నప్రసాద వితరణ**నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి వివిధ కాలనీ నుండి భక్తులుపాల్గొని విజయవంతం చేయడం జరిగింది.