“సైన్సు విమానాలను ఇస్తే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని ఎలా కూల్చొఛ్ఛో మతం చెప్పింది.”
డేనియల్ షుల్జ్..
మతం మనిషిని చేతకాని వాడిని చేస్తుంది లేదా, వాడి చేతికి ఆయుధాన్నైనా, ఇస్తుంది. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదాన్ని గమనించండి. విషయం దానంతట అదే అర్థమవుతుంది ముఖ్యంగా యువకులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సి ఉంది. సాంప్రదాయమైనా, సామాజిక సమస్య అయినా, రాజకీయాల్లో అయినా, మరే ఇతర విషయాలలోనయినా, యువత హేతుబద్ధంగా ఆలోచిస్తూ, విశ్లేషించుకుంటూ ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రాగల తరాల ప్రభావితం చేయగల అవకాశం శక్తి వారికే ఉన్నాయి. ఈ ప్రపంచం లోని మతాల్ని మట్టు పెట్టాల్సి ఉంది. లేకపోతే అవి ప్రపంచాన్ని మట్టు పెడతాయి. ఆ సూచనలు కూడా ప్రపంచంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి.
దేవుడిని నమ్మే వారికి ప్రతి భయమే. తిథి అంటే భయం. గ్రహణం అంటే భయం. చీకటి అంటే భయం. అమావాస్య అంటే భయం. దేవుడు అంటే భయం. దయ్యం అంటే భయం. వాస్తు అంటే భయం. జ్యోతిష్యం అంటే భయం.స్మశాన ం అంటే భయం. ఏదైనా పని ప్రారంభించాలంటే భయం. ఏ కారణం వల్లనైనా ఆ పని లో అంతరాయం కలిగితే భయం. ఇలా తనను తాను నమ్ముకోని వారికి భయలు ఎక్కువ. తనను తాను నమ్ముకున్న వాడికి భయాలు ఉండవు. దూసుకుపోతాడు. పక్షి తను వాలిన కొమ్మను నమ్మదు. అది విరిగిన భయపడదు. దానికి దాని రెక్కల బలం మీద విశ్వాసం ఉంటుంది. మనిషికి కూడా అలాంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. కుడి కన్ను అదిరినా,వీపుదురదపెట్టినా, పీడకల వచ్చినా, చాలామంది కీడు జరగబోతుందని భావిస్తారు. జల ప్రళయం రాబోతుందని, సునామీ తధ్యం అని,జలప్రళయం,రాబోతుందని, భూకంపాలు తప్పనిసరి అని,గ్యారంటీ గా, యుగాంతం అవుతుందని, ఎవడో, కోన్ కిస్కాగాడు, చెబితే వీరు నమ్ముతుంటారు. జనాన్ని నమ్మించడానికి అతను తన సిక్స్త్ సెన్స్ చెబుతుందని అంటాడు. అననీయండి కంగారు పడటం దేనికి? ప్రతి ఒక్కరికి కామన్సెన్స్ అనేది ఉంటుంది కదా? దాన్ని ఉపయోగించుకోవాలి. పక్షికి ఉన్నట్టు మనిషికి రెక్కలు లేవు గానీ అంతకన్నా బలమైన అంతకన్నా విలువైంది కామన్ సెన్స్ ఉంది. మానసిక బలహీనులైన వారు తమ కామన్ సెన్స్ ఉండా ఉపయోగించుకో లేరు. సైన్సు తెలుసుకోలేరు. అలాంటివారిని పక్కన పెట్టాలి. యువ రక్తం తో హేతుబద్ధంగా కదం తొక్కే, యువ శక్తి ఉంది కదా .అది చేతనత్వం తో క్రియాశీలకంగా మారాలి.
క్రైస్తవుల్ని కాపాడడానికి యెహోవా ఉన్నాడు. ముస్లిములను అల్లా. హిందువులకు శ్రీరాముడు తో పాటు మరో లక్ష మంది దేవతలు ఉన్నారు. పాపం రక్షణ రక్షణ లేని వారు నాస్తికులు, హేతువాదులు, మానవతావాదులు, శాస్త్రవేత్తలు, కమ్యూనిస్టులే, అని కొందరు,ఎకసెక్కంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది పొరపాటు. వారి ఆత్మవిశ్వాసమే వారికి రక్షణ. అదే వారిని కాపాడుతూ ఉంటుంది. అది లేని వారే దేవుడిని శరణు కోరుకుంటారు. రెక్కలు తెగిన పక్షులు నేల మీద పడినట్టు ఆత్మవిశ్వాసం లేని వారే ఏదో దేవుడి ముందు మోకరిల్లి తమను తాము మధ్య పెట్టుకుంటూ ఉంటారు. ఈ విషయం అర్థమైతే చాలా విషయాలు అలవోకగా అర్థం అవుతూ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని ఒప్పుకొని మత విశ్వాసకులు మన సమాజంలో చాలా మందే ఉన్నారు. వారు ఒప్పుకోకపోవడం కారణం ఏమిటంటే వారు కనిపిస్తున్న ఆధారాల్ని పట్టించుకోరు. కార్య కారణ సంబంధం గురించి ఆలోచించరు. తర్కానికి అందని కట్టు కథలు వారికి ఇష్టం. తాగుబోతు మద్యం తాగి,మత్తులో జోగినట్టు, వీరు సదా మూఢాచార సంపన్నులు. అందులోనే ఆనందంగా ఉందని భావించుకుంటారు. పైగా అందుకు సిగ్గుపడాల్సినది పోయి గర్వపడుతూ ఉంటారు. తమ తాత నేతులు తాగారు చెప్పుకుంటూ ఉంటారు. అంధ విశ్వాసం బంధురమైన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకులం,తామేనని ప్రకట్టించుకుంటారు. వారి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. కాబట్టి, సామాజిక సమస్యలు కూడా మత పరమైన గానే చూస్తారు. మతాలకతీతంగా మానవత్వం అనేది ఒకటుందని వారి మెదడుకి, తట్టదు. భావ స్వేచ్ఛ, స్వేచ్ఛా ఆలోచన, సృజనాత్మకత, వంటి వి వారి నిఘంటువుల్లో లేని పదాలు. అందుకే ఇంగ్లీష్ అమెరికన్ సిద్ధాంతకర్త,రాజకీయ కార్యకర్త,థామస్ ఫైనీ,ఇలాంటి వారి గురించి అంటాడు” మూర్ఖులతో వాదించడం, మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా స్పందించదో, విజ్ఞాన పరమైన విషయాలను మూర్ఖులు అర్థం చేసుకోలేరు” అని.
ఎంతో, సంఘర్షిస్తూ, మనిషి బట్ట కట్టే క్రమంగా ఆధునిక వస్త్రధారణకు అలవాటుపడి, నాగరికుడయితే, సనాతన ధర్మం పేరిట సన్యాసులు వస్త్రాలు లేకుండా, రాచ వీధుల్లో తిరగడం ఏం నాగరికత, ఏం సంస్కృతి? ఏం సాంప్రదాయం? ఇది కేవలం అనాగరిక లక్షణం. దీన్ని నిర్బంధంగా ఖండించాలి. ఇలాంటి నగ్న స్వాములను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకునే ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు దర్జాగా బట్టలు వేసుకొని ఎందుకు వెళ్తున్నట్టు? సనాతన ధర్మాన్ని పదిలంగా కాపాడాలని, ప్రచారం చేస్తున్న స్వాములు బాబాలు గురువులు ప్రవచన కారులు, అందరూ బట్టలిడిచి, రోడ్ల మీద నడవడం లేదు. ఇంకా నయం. జనానికి గొప్ప ఉపకారం చేస్తున్నారు. బాహ్యంగా వారంతా నాగరికులే కానీ, అంతర్గతంగా ఎంతటి అనాగరికులో ప్రజలే అర్థం చేసుకోవాలి.
న్యూమరాలజీ రంగురాళ్ల బాగోతం చాలా చూశాం. కొత్తగా ప్రాణిక్ హీలింగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడి నుంచో బాధితుడు ఫోన్ చేస్తే టెలివిజన్ ఛానల్లో కెమెరా ముందు కూర్చున్న బాధితుడికిన,ప్రాణిక్ హీలర్ వైద్యం చేస్తాడు. పట్టుకుని అడిగేవాడు లేక వెధవ వేషాలు ఎక్కువైపోతున్నాయి కదా! ఒకరు ఇలాంటి వాడిని స్టూడియోలోనే పట్టుకుని బండారం బయట పెట్టాడు. ముఖ్యంగా యువకులు ఎక్కడికక్కడ, ఇలాంటి వారి ఆటలు, కట్టించాలి. లేకపోతే ఏమిటి? గర్భంలోని పిండం ఆడ పిల్లలైతే దాన్ని మగ పిండంగా మారుస్తామని మోసగాళ్ళు బయలుదేరారు. వీళ్ళు కొంచెం జీవశాస్త్రం జన్యుశాస్త్రం లాంటివి ఉంటాయని కూడా తెలుసుకోరు. అమాయకుల్ని మోసం చేయడానికి బయలుదేరుతారు. చేతబడి బాణామతి లాంటి అనాగరిక మూఢవిశ్వాసాలను నుండి జనం ఎప్పుడు బయట పడతారో మరి.! ఇప్పటికీ ఇళ్ళపై రాళ్లు విసరడం జరుగుతుంది. ఇంకా చాలా మందికి కనికట్టు విద్య పై నమ్మకాలున్నాయి. విద్యావంతులైన యువకులు వీటిని రూపుమాపాలి.
కర్ణాటకలోని హసన్ జిల్లా రామనాథపురం కుక్కే సుబ్రహ్మణ్యం ఆలయంలో “మడి స్నాన” ఆచారం ఇంకా కొనసాగుతుంది. మడి అంటే పులి విస్తరి ఎంగిలాకు.తినేసిన ఎంగిలి విస్తళ్ళపై, వెనుకబడిన కులాల వారు బొర్లాడాలి.. మనిషి ఇతర గ్రహాల మీద ఆవాసాల కోసం అన్వేష్ స్తుంటే, అదే మనిషి ఇక్కడ మనుధర్మ శాస్త్రం ప్రకారం పరమ నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఐదు వందల ఏళ్లుగా వస్తున్న ఆచారమని గుడ్డిగా కొనసాగించడమే. ఈ కాలానికి పనికి వచ్చేదా, కాదా అని ఆలోచించుకోనక్కర లేదా? కుక్కే సుబ్రమణ్య ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయి. అందులో బ్రాహ్మణులు మొదట భోజనం చేసి వెళ్ళిపోయాక, దళితులు గిరిజనులు ఇతర వెనుకబడిన వారు ఆ ఎంగిలి విస్తరణపై బొర్లాడాలి. తర్వాత సమీపంలో ఉన్న కుమారధార నదిలో, స్నానం చేసి రావాలి. అప్పుడుగాని, వారు భోజనం చేయడానికి కుదరదు. సామూహిక భోజనం పేరుతో ఒక జాతి, ఇతర జాతుల వారి ని ఘోరంగా అవమానించడం జరుగుతుంది. జనాన్ని కులాలుగా విడగొట్టే మనుధర్మ శాస్త్ర లింకా వుండాల్సిందేనా?ఎంగిలాకులపై,దొర్లించి మానవ గౌరవాన్ని మట్టి పాలు చేసే ఆచారాలు ఇంకా అవసరమా? పోనీ నిమ్న కులాలు ఆకులపై దొర్లితే అగ్రకులాలకు వచ్చేదేముంది? వారి అహం సంతృప్తి చెందుతుందన్నమాట. అట్లా చేయడంవల్ల దుష్కర్మలు నశిస్తాయని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని, చర్మ రోగాలు తగ్గుతాయి చెబుతారు. నిజంగా ఇలాంటి ఫలితాలు వస్తాయి అంటే అగ్రవర్ణాలవారు, దళితుల ఎంగిలి విస్తళ్ళపై పొర్లి రావచ్చు కదా! కానీ అలా చేయరు. కారణం కొన్ని జాతులను తక్కువజేచి చూపడమే, ఆ కార్యక్రమ ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమం ఉడిపి లోని శ్రీ కృష్ణ మఠంలోను, ఇంకా కొన్ని ఇతర వైష్ణవాలయాలలో నో జరుగుతుంది. ఇలాంటి వాటికి ముగింపు పలకాల్సిందే నేటి యువకులే.
ఇప్పుడు దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో కి వెళ్లి ఒక విషయం సరిగ్గా అర్థం చేసుకుంటే. దేశాన్ని భ్రష్టు పట్టించిన దెవరో తెలిసిపోతుంది. భారతీయులంతా స్వాతంత్రం కోసం పోరాడుతున్న కాలమది. ఆ సమయంలో ఒక హిందూ మతోన్మాది, గోవా govalkar అనే అతను ఏమన్నాడంటే, “ఓ హిందువులారా మీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం ద్వారా మీ శక్తిని సమయాన్ని వృధా చేయొద్దు. మీ శక్తిని కాపాడుకోండి. మన అంతర్గత శత్రువులైన, ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడండి.” అని. అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకొననివారు, బ్రిటిష్ వారికి వంతపాడి భజన జేచిన వారు తగుదునమ్మా అని ఇప్పుడు దేశ ప్రజలకు దేశభక్తిని బోధిస్తున్నారు.అయినా ఎవరు ఏ కుటుంబంలో పుడితే ఆ కుటుంబంపై ప్రేమ ఉంటుంది. ఆ ఊరి మీద, ఆ మట్టి మీద, భాష మీద, ఆ దేశం మీద, ప్రేమ ఉంటుంది, ఇవన్నీ ఎవరో చెప్తే నేర్చుకోవాల్సినవి కావు, కపట బుద్ధి తో జనాన్ని విడగొట్టి రాజకీయం చేయాలనుకునేవారి, ఆలోచన వేరుగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.
అందరూ తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక దయనీయమైన స్థితిలో ఒక అబ్బాయికి మీరు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు అనుకుందాం. కొంతకాలం గడిచాక ఆ అబ్బాయి కనపడి నమస్కరించి మీ వల్ల నేను పరీక్ష ఫీజు కట్టి పాస్ అయ్యాను సార్ ఇప్పుడు నా జీవితమే మారిపోయింది అంతా మీ చలవే అని వినయంగా చెప్పాడు అనుకోండి. మీకు అతనికి ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఆ అబ్బాయి మిమ్మల్నిచూసి కూడా గుర్తు పట్టనట్టు వెళ్లాడు అనుకోండి,మీకెలా
ఉంటుంది.ఏముంది మనసులో ఉం ఫీలవుతారు కదా. వాడుసంస్కార హీనుడని, ముద్ర వేస్తారు కదా. మనం చేస్తున్న పొరపాటు కూడా అదే. నాగరికత మొదలైనప్పటి నుండి మానవాళి మనుగడ కోసం కొన్ని వేల ఏళ్ళు నూతన ఆవిష్కరణలు చేసిన శాస్త్రజ్ఞులు సాంకేతిక నిపుణులను, మనం కనీసం గుర్తుంచుకోం. వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోం. వాళ్లు కనుక్కున్న విషయాలు(వస్తువులు వగైరా) మాత్రం నిత్యజీవితంలో దర్జాగా ,తెగ వాడేస్తూ ఉంటాం. అదే ఎవరో రచయితలు సృష్టించిన పాత్రలకు పొద్దున లేస్తే పూజలు చేస్తాం. కల్పిత రక్షస పాత్రలు చనిపోయారంటే ఆనందంగా పండగ చేస్తాం. అంటే ఏమిటి? ఎదిగిన సమాజంలో మనమంతా ఇంకా ఎదగని మనుషుల మన్నట్టే కదా! నాగరికత ముఖ్యమే! సంస్కారం అంతకన్నా ముఖ్యం.