మా భూమి టైమ్స్ వెబ్ డెస్క్:

యోగ అనేది మన ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక అద్భుతమైన సాధనం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ యోగ డే సందర్బంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రజల అందరికీ యోగ డే శుభాకాంక్షలు తెలిపారు. యోగ డే సందర్బంగా మల్లాపూర్ , చిలుక నగర్ లో ఏర్పాటు చేసిన యోగ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యోగ అనేది మన ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక అద్భుతమైన సాధనం. నిత్యం యోగ సాధన ద్వారా మన జీవనశైలిని మార్చుకోవాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మీర్ పేట హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, చిలుకనగర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి, సర్మొట్ స్కూల్ యాజమాన్యం విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.