నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ వద్ద తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, అఖిలబారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ఆరు రోజుల క్రితం కాచిగూడలో నివసిస్తున్న నిరుపేద రజక వృత్తి దారుల కుటుంబానికి చెందిన తండ్రి మరణించి తల్లి మాత్రమే ఇండ్లల్లోపనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటు కాచిగూడ ప్రాంతంలో నివాస ఉన్నారు. వారి కూతురు 14 ఏళ్ల మైనర్ బాలిక కొంతమంది గంజాయి బ్యాచ్ మోసగించి నేరేట్ మెట్ట ఏరియా వినాయక నగర్ ప్రాంతానికి తీసుకెళ్లి మాయ, మాటలు చెప్పి అమ్మాయిని లోపరచుకొని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈగ్యాంగు ఉన్న వ్యక్తులు కొంతమంది ఇటీవల గంజాయికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులుగా తెలియ వచ్చింది. అట్టి గ్యాంగ్ ని వెంటనే అందరిని కూడా అరెస్టు చేసి మైనర్ బాలిక పై అత్యాచార చేసిన ఈ దుండగులను కఠినంగా చట్టపరంగా శిక్షించాలని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనిపోలీసు యంత్రాంగం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళఆశయ్య, రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఐద్వా జిల్లా కార్యదర్శి K. నాగలక్ష్మి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐద్వా కార్యదర్శి ఎం.వినోద, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వెంకటస్వామి మరియాల గోపాల్,మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి ఉపేందర్, సట్టు సుభద్రమ్మ, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.