మార్క్సిజం తోనే సమసమాజం సాధ్యం

0
115

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి అబ్బాస్

మార్క్సిజం తోనే సమాజంలో దోపిడీ పీడన అంతమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. శుక్రవారం  సిపిఎం జనగామ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఐ కన్వెన్షన్ లో రెండు రోజులపాటు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం స్టేషన్ ఘన్పూర్ మండల కార్యదర్శి మునిగెల రమేష్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎండి అబ్బాస్ హాజరై వర్తమాన రాజకీయాలు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులపై రాష్ట్ర బోధించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ కార్మికుల శ్రమ శక్తితో పెట్టుబడుదారులు దోపిడీ చేస్తున్నారని శ్రమకు తగ్గ ఫలితం అందించకుండా కార్మికుల అదనపు శ్రమతో పెట్టుబడిదారులు సంపన్నులుగా ఎదుగుతున్నారని వారు అన్నారు. ఒక పూట కూడా తిండికి నోచుకోని పేదల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని పాలకవర్గాలు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కోట్ల రూపాయల రుణాలను దేశ సంపదను అప్పనంగా దోచి పెడుతున్నారన్నారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుందని ఆర్థిక అసమానతలు లేని దోపిడి రైత సమాజం రావాలంటే సాధ్యమని వారు అన్నారు. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారం చూపేది మార్క్సిజమే అన్నారు. రెండో పూట క్లాసు సిపిఎం రాష్ట్ర నాయకులు మూడో శోభన్ నాయక్ శాస్త్రి ఆలోచన సమాజ పరిణామం అనే పాఠాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి రాపర్తి రాజు సింగారపు రమేష్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి జోగు ప్రకాష్ సుంచు విజేందర్ పోత్కనూరి ఉపేందర్, కోడెపాక యాకయ్య బోడ నరేందర్ ఎండి షబానా బెల్లంకొండ వెంకటేష్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ సాధం రమేష్ సారయ్య, గట్ల మల్లారెడ్డి గుండెబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు