మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల బదులు సొసైటీలకు నగదు జమ చేయాలనీ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేప పిల్లల పథకానికి బదులు సొసైటీలకే నగదు జమ చేయాలని ఈరోజు (స్టేషన్) ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలిసి పలు డిమాండ్లతో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మల విజేందర్ గొడుగు వెంకట్, జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి బిక్షపతి, సహాయ కార్యదర్శి నీరటి చంద్రయ్య, జిల్లా కమిటీ సభ్యులు కండ్లకొల్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.