కెరెల్లి జడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేత

ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యాబోధన ఉందని తెలంగాణ శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం
కెరెల్లి జడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ,యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్థానిక జడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మౌళిక వసతుల కోసం జిల్లా పరిషత్ నుంచి కూడా నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా బోర్లు వేయించినట్లు వెల్లడించారు. ఈ యేడాది పదిలో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా వచ్చిందని, వచ్చే యేడాది బాగా చదివించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, డీఈఓ రేణుకాదేవి, ఎంపీపీ, తదితరులు పాల్గొన్నారు.