*అంగట్లో సరుకుల్లా ముక్కుపచ్చలారని చిన్నారులు..
* హైదరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన నిజాలు
* మేడ్చల్ జిల్లా మేడపల్లి లో తీగలాగితే డొంకంతా కదిలింది.*
ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యధేచ్చగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్ ట్రాఫికింగ్ సీక్రెట్ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. మేడ్చెల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని చెందించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13మంది పిల్లలను రక్షించి 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
మాతృత్వాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు.. కొంతమంది కేటుగాళ్లు. పీర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు