హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై సస్పెన్షన్, ఫైన్స్ , ఎఫ్ ఐ ఆర్ లను ఎత్తివేయాలని SFI డిమాండ్
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో HCU యూనివర్సిటీ VC దిష్టిబొమ్మ దగ్ధం : SFI హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై సస్పెన్షన్, ఫైన్స్ , ఎఫ్ ఐ ఆర్ లను ఎత్తివేయాలని SFI డిమాండ్ చేసింది. గురువారం
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు వద్ద యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి అప్రజా స్వామికంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విసి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సుకున్ అనే యూనివర్సిటీ ఫెస్టివల్ ను నిర్వహించాలని విద్యార్థి సంఘం యూనివర్సిటీ అధికారులను అడిగినప్పటికీ స్పందన లేదని ఇక చేసేదేమీ లేక విద్యార్థి సంఘమే తమ సొంత జేబులో నుండి డబ్బులను ఖర్చు చేసి సుకూన్ ఫెస్టివల్ నిర్వహించడానికి మే 23 నుండి 25 వరకు తేదీలను ప్రకటించింది చివరి నిమిషం దాకా నిశ్శబ్దంగా ఉన్న అధికారులు చిట్టచివరికి ఫెస్టివల్ కు అడ్మిన్స్ పర్మిషన్ లేదని నెపంతో క్యాన్సిలేషన్ ఆదేశాలను పంపారు ఎన్నిసార్లు అధికారులను ప్రశ్నించినప్పటికీ స్పందన లేకపోవడంతో వీ.సీ లాడ్జి ముందు స్టూడెంట్ యూనియన్ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది స్పందించిన యూనివర్సిటీ విద్యార్థి లోకం వారి ఇంటి ముందు శాంతియుతంగా నిరసనకు దిగారు, విద్యార్థులకు సమాధానం చెప్పలేని అడ్మిన్ పోలీసులను పిలిపించి ఎఫ్ఐఆర్లను బుక్ చేయించాడు యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఎన్నుకోబడిన స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు మరియు ఎస్ఎఫ్ఐ కమిటీ సెక్రటరీ నలుగురు విద్యార్థులను సస్పెండ్ కు గురి చేశాడు అలాగే ఇంకొక ఐదుగురు విద్యార్థులపై పదివేల ఫైన్ విధించాడు ఇంతటి దుర్మార్గానికి అప్రజా స్వామికా పాలనకు పాల్పడ్డ అడ్మిన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అప్రాజస్వామిక పాలనకు నాంది పలికి పునాదులు వేస్తున్న అడ్మిన్ వెంటనే రాజీనామా చేయాలి విద్యార్థుల పై పెట్టిన సస్పెన్షన్, ఫైన్, ఎస్.ఐ.ఆర్ ల ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రెటరీ జస్వంత్ సందీప్ రాజకుమార్ వైష్ణవి అనూష శిరీష ప్రవళిక సుమన్ కుమార్ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.