Monday, December 23, 2024
HomeEducation systemనీట్ స్కాం ఎఫెక్ట్.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగింపు..

నీట్ స్కాం ఎఫెక్ట్.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగింపు..

ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టనున్న
ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా

మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్ :

నీట్ – యూజీ, యూజీసీ – నెట్
పరీక్షలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగించింది. ఎన్టీఏ నూతన చీఫ్ గా ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది. 1985 బ్యాచ్ కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక కేడర్ కు చెందిన ప్రదీప్ సింగ్ ఖరోలా 2017లో ఎయిరిండియా హెడ్ నియమితులయ్యారు. 2019లో ఏవియేషన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత, 2022 నుంచి ఐటీపీవో ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎన్టీఏ డీజీగా ప్రదీప్ సింగ్ కొనసాగనున్నారు.
ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అనేక ప్రవేశపరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments