తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ను బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నికల సరళి, పెరిగిన పోలింగ్ శాతం, తదితర అంశాలను చంద్రబాబునాయుడుకు నాగేశ్వరరావు వివరించారు.
నేతలు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేశారని, ఈసారి కందుకూరులో ఘన విజయం సాధించబోతున్నామని నాగేశ్వరరావు వివరించగా… అద్భుతంగా పనిచేశారంటూ చంద్రబాబునాయుడు అభినందించారు.