జూలై 2న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ

0
99

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

అయితే ఇప్పటి వరకు హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు ఘటనలతో ప్రతిపక్షాలు కూడా ఈ శాఖల మంత్రులు కనిపించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై 2వ తేదీన ఉంటుందని కాంగ్రెస్‌ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తనకు ఈ మేరకు తనకు సమాచారం ఉందని చెప్పారు. అదే రోజు మక్తల్‌ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు. మరోవైపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అన్నారు.

ఇక రుణమాఫీ గురించి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మీద అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివని ఎమ్మెల్యే అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు.. రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.