జూలై 1 న దేశ వ్యాప్తంగా కలెక్టరు కార్యాలయాలు ముందు జరుగు ధర్నాలు జయప్రదం చేయండి:
యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ పిలుపు
జూన్ 22,23,24 తేదీల్లో విజయవాడ లో జరిగిన
యంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సమావేశం నిర్ణయాలు విడుదల
కేంద్రం బిజెపి ప్రభుత్వం చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు గా
మూడవ సారి కేంద్రం అధికారంలోకి వచ్చింది అని
యంసిపిఐ(యు) పోలిట్బ్యూరో బృందం అన్నారు. మంగళవారం
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా (యునైటెడ్) కేంద్ర కమిటీ సమావేశాలు జూన్ 22,23,24 తేదీల్లో విజయవాడ లో యంసిపిఐ(యు) పోలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కిరణ్ జిత్ సింగ్ షేఖాన్ అధ్యక్షతన జరిగినాయి.
ఇట్టి సమావేశం నిర్ణయాలు యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి జూన్ 25 వ తేదీన ఓంకార్ భవన్ బాగ్ లింగం పల్లి యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేశారు.
తొలుత సమావేశం యంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కమిటీ సీనియర్ నాయకులు కామ్రేడ్ యస్ కే మాసూం , సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ ,
వివిధ సంఘటనల్లో మరణించిన వారందరికీ సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించ నైనది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం బిజెపి ప్రభుత్వం చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు గా
మూడవ సారి కేంద్రం అధికారంలోకి వచ్చింది అని, బిజెపి కి కేంద్రం లో సీట్లు తగ్గి స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ని ప్రజలు ఇవ్వక పోవటానికి కారణం గత పది సంవత్సరాలుగా ఏక పక్ష నియంతృత్వ, కార్పోరేట్, మత విద్వేష, విధానాలు అవలంబించి అనేక ప్రజాస్వామ్య గణతంత్ర భావాలు గలిగిన రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘించి తప్పుడు అప్రజాస్వామిక చట్టాలను తెచ్చిన విధానాన్ని భారత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు అని అందులో బాగంగా జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్రాల హక్కులను కాలరాసే విదంగా 370 యాక్ట్ ను రద్దు చేసిందని, దేశ వ్యాప్తంగా ఏక పన్ను విధానం పేరుతో జి యస్ టి పేరుతో ప్రజా దోపిడీ యదేచ్చగా కావించింది అని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిన విధానాన్ని రైతు కార్మిక పోరాటంతో ప్రతిఘటన చేసిన దొడ్డి దారిన రైతు కార్మిక వ్యతిరేక పాలన చేసింది అని, ఎన్నికల కమిషన్ నియమాక పద్దతి మార్చటం, మూడు నూతన క్రిమినల్ చట్టాలను జూలై 1 నుంచి అమలు కు పూనుకోవడం, ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేట్ సంపన్న వర్గాల మాఫియా దోపిడీ కి యథేచ్ఛగా 2022 నూతన గిరిజన చట్టాలను తేవడం, ఇప్పటికీ స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు అమలు చేయకుండా రైతు ల దోపిడీకి అనుకూలంగా వ్యవహరించడం, పరిశ్రమల ప్రైవేటీకరణ, రక్షణ రంగం, రైల్వే,జీవిత బీమా, విమాన యానం లాంటి అత్యంత పబ్లిక్ రంగం లో విదేశీ కార్పొరేట్ వర్గాలకు దోపిడీకి ద్వారాలు తెరువటం, సైనిక ఉద్యోగ నియామకాల్లో అగ్నివీర్ పథకం ద్వారా కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టి, ఉపా, రాజద్రోహం లాంటి నిరంకుశ చట్టాలను, ఈడి, ఐడీ, ఐటీ లాంటి సంస్థలు ద్వారా రాజకీయ ప్రత్యర్ధులను అణిచివేత, జైలులో పెట్టడం ఇత్యాది ప్రజా వ్యతిరేక మను వాద ఫాసిస్టు పాలనా విధానాలను అవలంబించింది అని ఈ విధానం ఫలితమే బిజెపి 303 సీట్లు నుంచి 240 సీట్లు వద్ద ప్రజలు ఆపారని —- కావున ప్రజల మనోభావాలను బిజెపి గౌరవించాలని అందుకు అణుగుణంగా తాను తీసుకున్న పై ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత రాజ్యాంగ లౌకిక వ్యవస్థను పరిరక్షించేందుకు బిజెపి ప్రజా తీర్పును గౌరవించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 1 వ తేదీన యంసిపిఐ(యు) కలిసి వచ్చే అన్ని శక్తులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేసి భారత రాష్ట్రపతి కి మెమోరాండాలు ఇవ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయం చేసింది అని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, గాదగోని రవి, అనుభవ్ దాస్ శాస్త్రి, మహేందర్ నేహా, శ్రీ కుమార్, అడ్వకేట్ రాజా దాస్, కేంద్ర కమిటీ సభ్యులు వనం సుధాకర్, గోనె కుమారస్వామి, కుంభం సుకన్య, యండి ఖాదర్ బాషా, కృష్ణా మ్మాల్, హన్నీస్, తదితరులు పాల్గొన్నారు.