కే ఎల్ ప్రయివేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి కేటాయించొద్దు. ఎస్ఎఫ్ఐ డిమాండ్

0
89

విద్యా వ్యాపారంగా మార్చే ప్రయివేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి కేటాయిస్తే పోరాటం తప్పదు

ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ విద్యాసంస్థలు అభివృద్ధి చేయాలి కానీ ప్రవేట్ యూనివర్సిటీలకు ఇవ్వడం సిగ్గుచేటు అని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కార్తీక్ అన్నారు.

కుత్భుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం గ్రామం సర్వే నెంబర్ 411,412,413, 427,428 వివిధ సబ్ డివిజన్ లో ఉన్న 5.05 ఎకరాల భూమి కే .ఎల్ యూనివర్సిటీ 2014 నుండి 2018 మధ్య కాలంలో రైతుల వద్ద నుండి పట్టా భూములు కొనుగోలు చేసి యూనివర్సిటీ పేరు మీద మార్చుకుంటున్నది. ఇట్టి స్థలం పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 354 లో 15.30 ఎకరాలు గల ప్రభుత్వ భూమిలో 5 ఎకరాలు తమ యూనివర్సిటీకి కేటాయించాలని అడగడాన్ని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్…. తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కార్తీక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ….. గాజులరామారం గ్రామం సర్వే నెంబర్ 411,412,413, 427,428 వివిధ సబ్ డివిజన్ లో ఉన్న 5.05 ఎకరాల భూమి కే .ఎల్ యూనివర్సిటీ 2014 నుండి 2018 మధ్య కాలంలో రైతుల వద్ద నుండి పట్టా భూములు కొనుగోలు చేసి యూనివర్సిటీ పేరు మీద మార్చుకుంటున్నది. ఇట్టి స్థలం పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 354 లో 15.30 ఎకరాలు గల ప్రభుత్వ భూమిలో 5 ఎకరాలు తమ యూనివర్సిటీకి కేటాయించాలని కోర్టుకి వెళ్లడం, అట్టి ప్రభుత్వ భూమిని ఎమ్మార్వో మరియు రెవెన్యూ ఉన్నతాధికారులు భూమి మార్పిడికి సిద్ధమైనట్టు సమాచారం వస్తున్నది.ఇట్టి ప్రభుత్వ భూమి దుండిగల్ గండి మైసమ్మ నుండి మియాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నది. కోట్ల రూపాయలో దాని ధర ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సహంతో ప్రయివేట్ కే ఎల్ యూనివర్సిటీకి భూమి మార్పిడి ప్రక్రియ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్టు అనిపిస్తున్నది, ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని భూమి మార్పిడి ప్రక్రియను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం, లేని యెడల విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు శివ, సాయి, నిఖిల్, సిద్ధార్థ్, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.